అన్వేషించండి

Korean Anti-Aging Secrets : ఏజ్​ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 10 ప్లస్ కొరియన్ టిప్స్​ని ఫాలో అయిపోండి

Korean Health Habits : వృద్ధాప్యఛాయలను దూరం చేసుకుంటూ.. వయసుతో పాటు యంగ్​ అండ్ ఎనర్జిటిక్​గా ఉండాలనుకుంటున్నారా? అయితే మీ లైఫ్​స్టైల్​లో ఈ కొరియన్ టిప్స్​ ఫాలో అయిపోండి.

Reverse Aging Tips : వయసైపోతుంటే స్కిన్, హెల్త్ సమస్యలు వస్తాయి. అయితే కొరియన్స్ మాత్రం తమ డైట్​లో, జీవన శైలిలో కొన్ని టిప్స్ రెగ్యులర్​గా ఫాలో అవుతారు. ఇవి వారి ఆయుష్షును పెంచడమే కాకుండా.. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. ఈ టిప్స్​ని రెగ్యులర్​గా ఫాలో అయితే స్కిన్ హెల్త్ మెరుగవడంతో పాటు ఎనర్జిటిక్​గా ఉంటారు. ఇంతకీ కొరియన్స్ ఏ టిప్స్ ఫాలో అవుతూ తమ లుక్​ని మెయింటైన్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. 

కిమ్చి.. 

కొరియన్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా.. దాదాపు ప్రతి వంటలో కూడా కిమ్చిని తీసుకుంటారు. కూరగాయలు, క్యాబేజి వంటి వాటిని పులియబెట్టి కిమ్చిని తయారు చేస్తారు. ఇది గట్​ హెల్త్​ని ప్రమోట్ చేయడంతో పాటు క్లియర్ స్కిన్​ని అందిస్తుంది. పలు అధ్యయనాలు కూడా ఇవే ఫలితాలు ఇచ్చాయి. పులియబెట్టిన ఫుడ్స్​ని చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఇది స్కిన్​ హెల్త్​ని, గట్​ హెల్త్​ని బాగా ప్రమోట్ చేస్తుంది. 

గ్రీన్ టీ

కాఫీ, టీలకు బదులుగా గ్రీన్​ టీ తీసుకుంటారు. షుగర్, కెఫిన్ క్రాష్​లను దూరం చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇది వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. 

జిన్సెంగ్ షాట్స్

రెడ్ జిన్సెంగ్ షాట్స్​ని రెగ్యులర్​గా తీసుకుంటారు. ఇవి సెక్సువల్ హెల్త్​ని బిల్డ్ చేయడంతో పాటు శరీరంలో కొల్లాజెన్​ని బూస్ట్ చేస్తుంది. ఇది స్కిన్​కి, హెయిర్​కి మంచి ఫలితాలు ఇస్తుంది. హార్ట్ సమస్యలను దూరం చేస్తుంది. 

బార్లీ టీ 

బార్లీ టీని తమ రొటీన్​లో భాగం చేసుకుంటారు. ఇది లివర్​ని డీటాక్స్ చేసి.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. ఇది పూర్వీకుల నుంచి కొరియన్స్ ఫాలో అవుతున్న విధానాల్లో ఒకటి. 

కోల్డ్ బాత్

సౌనా సెషన్స్​(sauna sessions)లో పాల్గొంటారు. అంటే హీట్​ రూమ్​లో పది నుంచి 20 నిమిషాలు ఉంటారు. ఇది రిలాక్సేషన్​ని అందించి.. చెమటను బయటకు పంపిస్తుంది. ఈ హీట్ థెరపీ తర్వాత చల్లని నీటితో స్నానాలు చేస్తారు. ఇది స్కిన్​ని టైట్ చేయడంలో, ఎనర్జిటిక్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. 

క్లెన్సింగ్.. 

క్లెన్సింగ్​ అనేది స్కిన్​ కేర్​లో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొరియన్లు డబుల్ క్లెన్స్​ని రొటీన్​ని ఫాలో అవుతారు. ఆయిల్​ క్లెన్సింగ్ తర్వాత ఫోమ్ క్లెన్సింగ్ చేస్తారు. ఇది ఫిల్టర్ మాదిరి స్కిన్​ని అందిస్తుంది. పోర్స్​ని క్లోజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

తేనెతో మాస్క్

రైస్ పౌడర్​లో తేనెను కలిపి మాస్క్​గా తయారు చేసి దానిని ముఖానికి మాస్క్​గా వేసుకుంటారు. ఇది హైడ్రేషన్​ని అందించడంతో పాటు ముఖంపై డర్ట్​ని క్లియర్ చేస్తుంది. 

స్పెషల్ సూప్

సీ వీడ్ సూప్​ (Miyeokguk)ని కచ్చితంగా వారానికోసారి తీసుకుంటారు. ఇది థైరాయిడ్ సమస్యలన్ని దూరం చేయడంతో పాటు రేడియంట్ స్కిన్​ని అందిస్తుంది. 

హైడ్రేషన్ రూల్

స్కిన్​ కేర్​లో భాగంగా మూడు టోనర్​లో, 2 సీరమ్​లు,  ఓ క్రీమ్​ని అప్లై చేస్తారు. ఇది గ్లాస్ స్కిన్​ని అందించి.. హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. 

జుట్టు కోసం.. 

బియ్యం కడిగిన నీటిని కొరియన్లు జుట్టుకోసం ఉపయోగిస్తారు. జుట్టు స్మూత్​గా, హెల్తీగా ఉండడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు షైనీగా, స్ట్రాంగ్​గా ఉంటుంది. 

10కె స్టెప్స్

రోజూ కనీసం 10 వేల అడుగులు కచ్చితంగా వేసేలా ప్లాన్ చేస్తారు. దాదాపు దగ్గర్లో ఉండే షాప్​లకు, మాల్స్​కు నడిచి వెళ్లేందుకు కొరియన్స్ ప్రిఫర్ చేస్తారు. ఇది బరువును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

మరిన్ని టిప్స్

కొల్లాజెన్​ జెల్లీలను స్నాక్స్​గా తీసుకుంటారు. ఇవి ముడతలను దూరం చేస్తుంది. విటిమిన్ సి పౌడర్​ని కూడా తీసుకుంటారు. ఇది స్కిన్​ హెల్త్​ని మెరుగుపరిచి డార్క్ స్పాట్స్​ని దూరం చేస్తుంది. ఎల్​ఈడీ మాస్క్​ థెరపీని తీసుకుంటారు. ఇది కొల్లాజెన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోరు. Delulu = solulu అంటూ కొరియన్స్ యాంగ్జైటీని దూరం చేసుకుంటారు. ఈ టిప్స్​ తమ రొటీన్​లో భాగం చేసుకోవడం వల్ల వారి వయసు పెరిగినా యంగ్​గా, యాక్టివ్​గా ఉంటారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget