కొరియన్​ అమ్మాయిలు తమ స్కిన్, హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ముఖ్యంగా బ్యూటీ విషయంలో కొన్ని విషయాలను అస్సలు విస్మరించరు. వాటిని ఫాలో అయితే మీరు బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు.

డబుల్ క్లెన్సింగ్ చేస్తారు. మేకప్ తీయడానికి ఆయిల్ బేస్డ్ క్లెన్స్ర్.. చర్మాన్ని క్లీన్ చేయడానికి వాటర్ బేస్డ్ క్లెన్సర్ వాడుతారు.

చర్మాన్ని వారంలో ఓసారైనా ఎక్స్​ఫోలియేట్ చేస్తారు. దీనివల్ల చర్మంపై డెడ్ స్కిన్ పోతుంది.

ఎంజైమ్ బేస్డ్ ఎక్స్​ఫోలియెంట్ ఉపయోగిస్తే చర్మం సున్నితంగా మారుతుంది. స్కిన్​ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచే ఎసెన్స్​లను ఉపయోగిస్తారు. ఇవి వారి స్కిన్​ని యంగ్​గా ఉండేలా చేస్తాయి.

pH ఉండే టోనర్​ని స్కిన్​ హెల్త్​ కోసం ఉపయోగిస్తారు. దీనివల్ల స్కిన్ సమస్యలు తగ్గుతాయి.

వారానికోసారి హైడ్రేషన్, పోషణ కోసం ఫేస్ మాస్క్ ఉపయోగిస్తారు.

సన్​స్క్రీన్, మాయిశ్చరైజర్​ను స్కిప్ చేయరు. SPF 30 ఉండే సన్​స్క్రీన్​ను ఎంపిక చేసుకోవాలి.

సరైన నిద్ర, హెల్తీ డైట్​ని ఫాలో అవుతూ ఉంటే స్కిన్​ హెల్తీగా ఉటుంది. మెరుస్తూ ఉంటుంది.