Bay Leaf: బిర్యానీ ఆకులు తినకుండా పడేస్తున్నారా? మీకే నష్టం
Bay Leaf: బిర్యానీ ఆకులను చాలామంది తక్కువ తింటారు. వాటిని తినడానికి ఎక్కువమంది ఇష్టపడరు.
Bay Leaf: బిర్యానీ ఆకులు బే లీఫ్ అని పిలుస్తారు. కొన్ని రకాల కూరలు, బిర్యానిలు, పలావులు వండినప్పుడు ఈ బిర్యానీ ఆకును వాడుతూ ఉంటారు. కానీ చాలామందికి దీని విలువ తెలియదు. బిర్యానీ ఆకు లేకుండానే వంటకాలను పూర్తి చేస్తారు. ఇది వంటకానికి ఏం ఇస్తుందో అన్నదానిపై ఎలాంటి అవగాహనా లేదు. కొంతమంది మాత్రం బిర్యాని ఆకును వాడడం వల్ల కాస్త రుచి, సువాసన వస్తుందని అనుకుంటారు. వీటన్నిటికంటే ముఖ్యం... బిర్యానీ ఆకు మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. బిర్యాని ఆకులో ఉండే పోషకాలన్నీ వండుతున్నప్పుడే ఆహారంలో కలిసిపోతాయి. ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే బిర్యానీ ఆకులు తినేసినా కూడా ఎంతో మంచిది. కానీ దాన్ని తీసి పడేసే వాళ్లే అందరూ.
ఏ ఆహారంలోనైనా బిర్యానీ ఆకులను కలిపి వండితే ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు రావు. అలాగే ఈ బిర్యాని ఆకులతో టీ చేసుకుని తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. దీనివల్ల గుండెకు ఆరోగ్యం. ఈ ఆకుల్లో కాల్షియం, మాంగనీస్, విటమిన్ కే, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలను దృఢంగా మారుస్తాయి. మధుమేహలు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఈ బిర్యానీ ఆకులు కూడా ఒకటి. ఇది రక్తంలో చక్కెర పెరగకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా బిర్యానీ ఆకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి చక్కటి నిద్ర పట్టేలా చేస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు బిర్యాని ఆకులు ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి. లేదా బిర్యానీ టీ తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్న వారు ఈ బిర్యానీ ఆకులను తింటే మంచిది. ఈ ఆకుల్లో ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు ఉంటాయి. అలాగే కీళ్ల వాపులతో బాధపడేవారు కూడా ఈ బిర్యానీ ఆకుతో టీ చేసుకుని తాగితే మంచిది. ఇది జుట్టుకు, చర్మానికి కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఇది ముందు ఉంటుంది. ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ రాకుండా అడ్డుకుంటుంది. అలాగని మరీ ఎక్కువగా బిర్యానీ ఆకులు తిన్నా ప్రమాదమే. ఒకటి లేదా రెండు ఆకులతో ఆపేయాలి. ఎక్కువ ఆకుల తింటే మాత్రం రక్తం గడ్డకట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మధుమేహులు బిర్యానీ ఆకులను పొడిగా చేసుకుని ఉదయం, సాయంత్రము నీటిలో కలుపుకొని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. శ్వాస సమస్యలు, గురక, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు... వంటి వాటిని కూడా ఈ ఆకు దూరం పెడుతుంది. యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఈ ఆకులో ఎక్కువ. కాబట్టి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.