Tatkal Ticket Booking: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
తత్కాల్ టికెట్ బుక్ చేయడమంటే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో ఫాస్టెస్ ఫింగర్ ఆడినట్లే. ఈ చిట్కాలు పాటిస్తే.. తప్పకుండా మీకు కన్ఫార్మ్ టికెట్ దొరుకుతుంది.
సంక్రాంతి మరెన్నో రోజులు లేవు. రెండు నెలల కిందటే ఆయా తేదీల టికెట్లన్నీ బుక్కైపోయాయి. దీంతో అంతా Tatkal (తత్కాల్) టికెట్లను బుక్ చేసుకొనే పనిలో ఉన్నారు. అయితే, తత్కాల్‌లో టికెట్లు బుక్ చేయడమంటే.. అంత సులభం కాదు. ఇందుకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవాలి. లాగిన్ నుంచి పేమెంట్ వరకు ప్రతి ఒక్కటీ పెద్ద టాస్కే. ఒక్క సెకన్ ఆలస్యమైనా.. టికెట్ల మీద ఆశలు వదిలేసుకోవల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తత్కాల్ టికెట్లను వేగంగా బుక్ చేసుకోవచ్చు. అవేంటో చూసేయండి మరి.
తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయడమంటే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లోని ‘ఫాస్టెస్ట్ ఫింగర్స్’ ఆడినట్లే. అందులో ఎవరైతే అందరి కంటే ముందుగా వేగంగా సమాధానాలను ఆర్డర్‌లో పెడతారో.. వారే ‘హాట్’ సీట్లో కూర్చుంటారు. తత్కాల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రైల్లో ఉండే దాదాపు 120 నుంచి 160 టికెట్లను బుక్ చేసుకోడానికి కొన్ని వేల మంది ప్రయత్నిస్తుంటారు. బుకింగ్ స్టార్టయిన సెకన్ వ్యవధిలోనే.. గేమ్ స్టార్టవ్వుతుంది. ఇందులో మీరు గెలవాలంటే.. రెగ్యులర్ టికెట్లు బుక్ చేసినట్లుగా చేయకూడదు. ఇందుకు కొన్ని కిటుకులు ఉన్నాయి. టికెట్ సాధించాలంటే.. మీరు మరింత స్మార్ట్‌గా వేగంగా ఉండాలి.
⦿ తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి మొబైల్ యాప్‌కు బదులు.. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉపయోగించడం మంచిది.
⦿ మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా కాల్ వస్తే.. శ్రమంతా వృథా అవుతుంది.
⦿ ముందుగా మీకు ఏ ట్రైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలనే క్లారిటీ ఉండాలి. బుకింగ్ మొదలయ్యాక సెర్చ్ చేయకూడదు.
⦿ IRCTCలోకి లాగిన్ అవ్వడానికి ముందే మీరు ప్రయాణికుల పేర్లను ల్యాప్‌టాప్/కంప్యూటర్‌లోని Notepadలో రాసి పెట్టి ఉంచుకోవాలి.
⦿ నోట్‌పాడ్‌లో ప్యాసింజర్ల పేర్లు ఉంచడం వల్ల త్వరగా ప్యాసింజర్ లిస్టులోకి కాపీ, పేస్ట్ చేయడం వీలవుతుంది.
⦿ తత్కాల్ పేమెంట్ చేయడం కూడా పెద్ద టాస్కే.. కాబట్టి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, వాలెట్‌ను IRCTC సైట్‌లో సేవ్ చేసుకోండి.
⦿ IRCTC సైట్ లేదా యాప్‌లో కార్డ్ డిటైల్స్ ముందుగానే పెట్టుకోవడం వల్ల పేమెంట్ సులభం అవుతుంది.
⦿ తత్కాల్ టికెట్‌ను బుక్ చేయడానికి అన్నికంటే ముఖ్యమైనది.. ఇంటర్నెట్. అది వేగంగా పనిచేస్తేనే మీరు త్వరగా టికెట్ బుక్ చేయగలరు.
⦿ ముఖ్యంగా IRCTC వ్యాలెట్‌లో ముందుగానే డబ్బులు జమా చేసుకుని ఉంటే మరింత వేగంగా బుకింగ్ పూర్తవుతుంది.
⦿ మీ మొబైల్ ఫోన్‌ను కూడా బాగా సిగ్నల్ అందే ప్లేస్‌లో పెట్టండి. లేకపోతే OTPలు ఆలస్యమవుతాయి.
⦿ తత్కాల్ బుకింగ్ మొదలైన తర్వాత ఎప్పుడూ లాగిన్ కాకూడదు.
⦿ బుకింగ్ మొదలవ్వడానికి కనీసం 10 నిమిషాల ముందే మీరే లాగిన్ అవ్వాలి.
⦿ ఒక IRCTC ఐడి నుంచి ఒక్కరే లాగిన్ అవ్వాలి.
చూశారుగా.. ఇకపై తత్కాల్ టికెట్లు బుక్ చేసుకొనేప్పుడు పై చిట్కాలను ప్రయత్నించి చూడండి. మీ వద్ద మరేమైనా టిప్స్ ఉన్నా.. మాతో షేర్ చేసుకోండి.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి