Japanese Walking : నడకతో గుండె, షుగర్, బరువు సమస్యలకు చెక్.. ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ ట్రై చేయండి
Japanese Fitness Techniques : వాకింగ్ చేసే అలవాటు ఉంటే.. మీరు జపనీస్ వాకింగ్ టెక్నిక్ ఫాలో అవ్వండి. దీనిని ఎలా చేయాలి.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Japanese Walking Benefits : నడకతో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే నడిచేప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. అలాంటి టెక్నిక్స్‌లో జపనీస్ వాకింగ్ టెక్నిక్ ఒకటి. దీనిని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అని కూడా అంటారు. జపనీస్ తమ ఫిట్నెస్ టెక్నిక్‌లో భాగంగా ఫాలో అవుతారని.. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకీ జపనీస్ టెక్నిక్ అంటే ఏంటో.. దానిని ఫాలో అవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
జపనీస్ వాకింగ్ టెక్నిక్..
జపనీస్ వాకింగ్ టెక్నిక్‌లో బ్రేక్, బ్రీతింగ్ ప్రధానంగా ఉంటాయి. దీనిలో భాగంగా వాకింగ్ చేసేప్పుడు 3 నిమిషాలు వేగంగా నడుస్తారు. అనంతరం మూడు నిమిషాలు నెమ్మదిగా, రిలాక్స్‌గా నడుస్తారు. అరగంట వాకింగ్ చేస్తూ.. దీనిని రిపీట్ చేస్తారు. ఆన్-ఆఫ్ పద్ధతిలో ఇది ఉంటుంది. అలాగే నడిచేప్పుడు భంగిమ, బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. ముక్కుతో గాలి పీల్చుకొని.. నోటితో వదులుతారు. ఇది నడకకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూసేద్దాం.
గుండె ఆరోగ్యానికి..
ఆన్-ఆఫ్ పద్ధతిలో వాకింగ్ చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరిగి.. తగ్గుతుంది. ఇది గుండెకు బలాన్ని చేకూర్చుతుంది. రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గుండె జబ్బులు తగ్గించి.. హార్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహం
ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి.. గ్లూకోజ్ మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ప్రీ డయాబెటిక్స్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ వాకింగ్ టెక్నిక్ మంచి ఫలితాలు ఇస్తుంది.
కొవ్వు
శరీరంలో కొవ్వు తగ్గించడంలో ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ హెల్ప్ చేస్తుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలో ఫ్యాట్‌ను బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. చెడు కొవ్వు కరిగి ఎనర్జీ శరీరానికి అందుతుంది.
కండర బలం
కాళ్లు, పిరుదులు, తుంటి కండరాలు మరింత స్ట్రాంగ్‌గా మారుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా శరీరం కింద భాగం స్ట్రాంగ్ అవుతుంది. కీళ్ల పనితీరు మెరుగవుతుంది.
ఎనర్జీ
వేగంగా, నెమ్మదిగా నడవడం వల్ల శరీరం త్వరగా యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇది ఏరోబిక్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఉదయాన్నే దీనిని చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
మానసిక ప్రయోజనాలు
యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేయడంలో ఈ వాకింగ్ టెక్నిక్ హెల్ప్ చేస్తుంది. వాకింగ్‌లో బ్రీతింగ్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల ఒత్తిడి దూరమవడంతో పాటు మూడ్ కూడా మెరుగవుతుంది.
శ్వాసకోశ సమస్యలు
ఈ వాకింగ్ని ఫాలో అయినప్పుడు లంగ్స్ ఆక్సిజన్ తీసుకోవడం, మళ్లీ బయటకు వదలడం వల్ల శ్వాసకోశ శక్తి పెరుగుతుంది. తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉంటే దూరమవుతాయి.
మరిన్ని ప్రయోజనాలు
ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ వల్ల వాకింగ్ మెరుగవుతుంది. భంగిమ కరెక్ట్‌గా ఉంటుంది. వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి. బీపీ, ఒబెసిటీ, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. దీనిఫలితాలు ఎక్కువకాలం, ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి వారంలో 3 నుంచి 4 రోజులు.. రోజుకు 30 నిమిషాలు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇది పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి.. ఎలాంటి ఆలోచన లేకుండా తమ ఫిట్నెస్ రొటీన్లో భాగం చేసుకోవచ్చు.






















