అన్వేషించండి

Flood Proof House - వీడియో: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు

ఈ ఇల్లు వరదల్లో మునగదు. ఈ ఇంట్లోకి చుక్క నీరు కూడా చేరదు. పైగా భూమికి కొన్ని అడుగుల ఎత్తు వరకు తేలుతుంది. అయినా కొట్టుకుపోదు. ఇదేదో బాగుంది కదా.

భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తాయి. ముఖ్యంగా నదీ తీరంలో నివసించే ప్రజలు వరదల సమయంలో ఇంట్లో ఉండాలంటేనే వణికిపోతారు. వరదల వల్ల ఒక్కోసారి ఇళ్లు కూడా పూర్తిగా మునిగిపోతుంటాయి. దీంతో చాలామంది ఇళ్ల పైకప్పులపైకి చేరి సాయం కోసం ఎదురుచూస్తుంటారు. వరదలు తగ్గిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వెంటాడతాయి. ఇంట్లోకి వచ్చే నీరు వల్ల భారీగా బురద పేరుకుపోతుంది. వాటిలో పాములు కూడా ఉంటాయి. అయితే, జపాన్ ఇంజినీర్లు రూపొందించిన ఈ ఇళ్లు.. భారీ వరదలను సైతం తట్టుకుంటాయి. చుక్క నీరు కూడా ఇంట్లోకి వెళ్లదు. అలాగే ఆ ఇళ్లు వరదలో కొట్టుకుపోవు కూడా. 

  • ప్రకృతి వైపరిత్యాలకు పెట్టింది పేరు జపాన్. భుకంపాల నుంచి సునామీల వరకు ప్రతి విపత్తు గురించి అక్కడి ప్రజలకు అవగాహన ఉంది. అందుకే, వారు చెక్కలతో తేలికపాటి ఇళ్లను నిర్మిస్తారు. జపాన్‌లో ఉన్న భారీ భవనాలు సైతం విపత్తులను తట్టుకోగలిగేవే. భూకంపాల సమయంలో భయంకరంగా అటూఇటూ.. ఊగుతాయే గానీ, కూలిపోవు. అయితే, భారీ వరదల సమయంలో ప్రజలు నివసించే మునిగిపోవడమే కాకుండా, నీటితోపాటు కొట్టుకెళ్లిపోతాయి. నీరు కూడా చాలా వేగంగా ఇళ్లల్లోకి చేరిపోతుంది. 
  • ఈ నేపథ్యంలో జపనీస్ హౌసింగ్ డెవలపర్ ఇచిజో కొముటెన్ ఇటీవల ‘వరద-నిరోధక ఇల్లు’(flood-resistant house)ని ఆవిష్కరించారు. ఇది వరదల సమయంలో నీరు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, నీటితోపాటూ పైకి తేలుతుంది కూడా. అదేంటీ, అలా తెలితే ఈజీగా కొట్టుకుపోతుంది కదా అనేగా మీ సందేహం. అలా ఇల్లు వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు బలమైన నాలుగు ఇనుపు కడ్డీలను భూమిలోకి పాతారు. వాటికి బలమైన ఇనుప తాళ్లను ఇల్లు నాలుగు కొనలకు కట్టారు. దీనివల్ల వరద నీరు వచ్చినప్పుడు ఇల్లు కూడా పైకి తేలుతుంది. దానివల్ల ఇల్లు పూర్తిగా మునిగిపోదు. పైగా ఆ ఇంటి తలుపులు, నిర్మాణమంతా వాటర్ ప్రూఫ్. చిన్న రంథ్రం నుంచి కూడా నీరు బయటకు వెళ్లదు. భారీ దుంగలు వచ్చి గుద్దినా సరే వాటి అద్దాలు పగలవు. 
  • ఇటీవల ఓ ప్రముఖ జపనీస్ టీవీ షోలో ఈ ‘ఫ్లడ్ రెసిస్టెంట్ హౌస్’ పనితీరును ప్రదర్శించారు. అప్పటినుంచి స్థానిక ప్రజలు అలాంటి ఇళ్లు తమకూ కావాలంటూ ఆ సంస్థను సంప్రదిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా రెండు వేర్వేరు భారీ నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక దాన్లో సాధారణ ఇంటిని, మరొకదాన్లో ‘ఫ్లడ్ రెసిస్టెంట్’ హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ వాటర్ ట్యాంకుల్లోకి ఫోర్సుగా నీటిని వదలడం ప్రారంభించారు. సాధారణ ఇంట్లోకి నీరు ప్రవేశించి.. గదులన్నీ మునిగిపోగా, ఫ్లడ్ రెసిస్టెంట్ హౌస్‌లోకి మాత్రం ఒక చుక్క నీరు కూడా వెళ్లలేదు. పైగా ఆ ఇల్లు నీటి మట్టంతోపాటే కొన్ని అడుగుల ఎత్తుకు లేచింది. ఆ ఇల్లు కొట్టుకుపోకుండా ఆ ఇంటికి అమర్చిన కేబుళ్లు గట్టిగా పట్టుకున్నాయి.
  • ఇచిజో కొముటెన్‌లోని ఇంజనీర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వరద-నిరోధక ఇల్లు భూమి నుంచి ఐదు మీటర్ల వరకు తేలుతుంది. కాబట్టి, నీరు కిటికీలకు చేరుకునే అవకాశం లేదు. ఇల్లు కాస్త పైకి తేలడం వల్ల నీరు ఫోర్సుగా ఇంటిని తొయ్యదు. ఇంటి కింద నుంచి నీరు ప్రవహిస్తూ వెళ్లిపోతుంది. ఈ ఇంటి నిర్మాణానికి రూ.4,46,039 మాత్రమే ఖర్చవుతుంది. ఇంటి సైజు, సదుపాయాలు పెరిగే కొద్ది ధర కూడా పెరుగుతుంది. అయితే, మిగతా ఇళ్లతో పోల్చితే చాలా తక్కువ ధరకే ఈ ఇల్లు లభిస్తుండటంతో ప్రజలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో:

Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?

Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Embed widget