![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pregnancy Food: గర్భం ధరించాక వీటిని తినకపోవడమే ఉత్తమం, తెలియక తినేసేవాళ్లే ఎక్కువ
Pregnancy Food: గర్భం ధరించాక ఏమి తినాలో చాలా మందికి తెలియదు. తెలియక కొన్ని తినకూడనివి కూడా తినేస్తుంటారు.
![Pregnancy Food: గర్భం ధరించాక వీటిని తినకపోవడమే ఉత్తమం, తెలియక తినేసేవాళ్లే ఎక్కువ It is better not to eat these during pregnancy, Pregnancy Food: గర్భం ధరించాక వీటిని తినకపోవడమే ఉత్తమం, తెలియక తినేసేవాళ్లే ఎక్కువ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/4b8d9b722c7641e837aebbf9924804571665195133783248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pregnancy Food: కాబోయే తల్లులు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆహారం విషయంలో ఏవి తినకూడదో, ఏవి తినవచ్చో చాలా మందికి క్లారిటీ ఉండదు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల తల్లి, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు తినకపోవడమే ఉత్తమం. ఏమేం తినకూడదో ఇక్కడ జాబితా ఇచ్చాం.
1. విటమిన్ ఎ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. అయితే దీనికోసం క్యారెట్ వంటివి అధికంగా తినాలి. మాంసాహారమైన లివర్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది. కానీ దీన్ని తినకపోవడమే మంచిది.
2. మాంసాహారం తినడం మంచిదే కానీ బాగా ఉడికాక మాత్రమే తినాలి. 80శాతం, 70 శాతం ఉడికిన మాంసాన్ని తినకూడదు. ఇలా తినడం వల్ల టోక్సోప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ రావచ్చు. దీని వల్ల బిడ్డ మెదడు ఎదగకపోవచ్చు. అలాగే కళ్లు సరిగా కనిపించకపోవడం కూడా జరగొచ్చు.
3. పచ్చి గుడ్డు జోలికి పోకూడదు. అలాగే హాఫ్ బాయిల్ (సగం ఉడికిన) గుడ్లను కూడా తినకూడదు. వీటిలో సాల్గొనెల్లా అనే బ్యాక్టిరియా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధులకు కారణం అవుతుంది. టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది.
4. పచ్చి కాయగూరలపై కూడా టోక్సోప్లాస్మోసిస్ కలుగజేసే బ్యాక్టిరియా ఉంటుంది. ఇది గర్భంలోని శిశువుకు చాలా హాని చేస్తుంది.
5. పాశ్చరైజేషన్ చేయని పాలను వాడకూడదు. ఈ పాలలో లిస్టీరియా, బొవైణ్ టి. బి అనే బ్యాక్టిరియాలు ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. గర్భస్రాయం అయ్యే అవకాశాన్ని పెంచుతాయి.
6. జంక్ పుడ్, ఫాస్ట్ పుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. వీటిలో అజినామోటోను అధికంగా వాడతారు. ఇది గర్భస్థ శిశువులకు చాలా ప్రమాదకరమైనది.
7. కొందరు ఆవకాయలు, ఊరగాయలు,ఇతర నిల్వ పచ్చళ్లను అధికంగా తింటారు. వీటిని మితంగా తినడం వల్ల మంచిదే. కానీ రోజూ తినడం వల్ల వేడి చేసి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
8. ఇక మద్యపానం, ధూమపానానికి చాలా దూరంగా ఉండాలి. గర్భిణిలు ఈ రెండు పనులు చేయడం వల్ల గర్భస్థ శిశువుల్లో కాలేయం, శ్వాససబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
పిల్లలు బావుండాలంటే రోజూ దానిమ్మ జ్యూస్, జీడిపప్పులు, బాదం, పిస్తా వంటి నట్స్, ఖర్జూరాలు, అరటి పండ్లు, ఆపిల్స్, బీట్రూట్, ఎండు అంజీర్లు, బాగా ఉడకబెట్టిన గుడ్డు, చేపలు, బాగా ఉడికించిన చికెన్ (లివర్ తప్ప), పప్పు ధాన్యాలు వంటివి తినాలి.
Also read: వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి
Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)