అన్వేషించండి

Tasty Breakfast : అటుకులతో ఇడ్లీలు.. పుదీనా, టమాటాలతో చట్నీ.. కాంబినేషన్ అదుర్స్

The Best Combination of Idly : ఇన్​స్టాంట్ ఇడ్లీలతో పాటు అదిరిపోయే చట్నీ కాంబినేషన్ ఉంటే ఇంకేమి కావాలి. మరి టేస్టీ బ్రేక్​ఫాస్ట్​ కాంబినేషన్​ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

South Indian Breakfast : ఇంట్లో అటుకులు ఉంటే ఇడ్లీలను మీరు ఇట్టే తయారు చేసుకోవచ్చు. గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. పిండి పులియనవసరం లేదు. ఎంచక్కా కొన్ని నిమిషాల్లో మెత్తని స్పాంజీల్లాంటి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. అటుకులతో ఇన్​స్టాంట్ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

అటుకులు - 1 కప్పు

బియ్యం రవ్వ - ఒకటిన్నర కప్పు

మజ్జిగ - 1 లీటర్ 

వంట సోడా - అర స్పూన్ 

ఉప్పు - తగినంత

తయారీ విధానం

ముందుగా గిన్నె తీసుకోండి. దానిలో అటుకులు వేయండి. ఇప్పుడు బియ్యం రవ్వ, మజ్జిగను వేసి.. వాటిని ఓ పది నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యం రవ్వ, అటుకుల్లోకి మజ్జిక చేరి.. వాటిని మెత్తగా చేస్తుంది. అయితే దీనికోసం మీరు పుల్లటి మజ్జిగ తీసుకుంటే రుచి మరింత బాగుంటుంది. పది నిమిషాల తర్వాత నానబెట్టిన వాటిని మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని పేస్ట్​గా చేయాలి. దానిలో కాస్త ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై ఇడ్లీ కుక్కర్ పెట్టాలి. ఇడ్లీ కుక్కర్​లో నీరు వేసి.. ప్లేట్లకు నెయ్యి రాసి.. దానిపై ఇడ్లీ పిండిని ఉంచాలి. అనంతరం వాటిపై మూత పెట్టి.. ఇడ్లీలను ఉడకనివ్వాలి. అవి సిద్ధమైపోయిన తర్వాత ప్లేట్లలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వీటిని మీరు పొడులు, చట్నీలతో కలిపి తినవచ్చు. అయితే ఇడ్లీకు పర్​ఫెక్ట్ కాంబినేషన్ పుదీనా, టమాట పచ్చడి. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. మరి ఈ టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

టోమాటాలు - 4

పుదీనా ఆకులు - గుప్పెడు

నువ్వుల గింజలు - 3 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి - 8

వెల్లుల్లి - 5 రెబ్బలు 

జీలకర్ర - 1 స్పూన్ 

చింతపండు - 1 స్పూన్ 

ఉప్పు - రుచికి తగినంత 

తాళింపు కోసం

నూనె- 1 టేబుల్ స్పూన్

ఆవాలు - 1 టీస్పూన్

మినపప్పు -1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 స్పూన్

శెనగపప్పు -1 స్పూన్ 

తయారీ విధానం 

ముందుగా స్టౌవ్ వెలిగించి నూనె వేయండి. దానిలో నువ్వులు, జీలకర్ర వేసి వేయించండి. అనంతరం టమాట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా వేసి వేయించండి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి స్టౌవ్ ఆపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వండి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా.. కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా తయారు చేసుకోండి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. చిన్న కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మినపప్పు, శనగపప్పుతో తాలింపు వేయండి. ఈ తాలింపులో ముందుగా తయారు చేసుకున్న చట్నీని వేసి బాగా కలపండి. అంతే టేస్టీ, స్పైసీ పుదీనా, టమాట చట్నీ రెడీ. దీనిని వేడి వేడి ఇడ్లీలతో లేదా దోశలతో కూడా కలిపి తీసుకోవచ్చు. 

Also Read : దిబ్బరొట్టె చేయాలంటే కూసింత కళా పోషణ ఉండాలి.. టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ఫాలో అవ్వాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget