Andhra Style Dibba Rotti : దిబ్బరొట్టె చేయాలంటే కూసింత కళా పోషణ ఉండాలి.. టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ఫాలో అవ్వాలి
Dibba Rotti Recipe : పర్ఫెక్ట్ దిబ్బరొట్టె గురించి చూస్తున్నారంటే మీరు కచ్చితంగా ఆంధ్రా స్టైల్ దిబ్బ రొట్టె తినాల్సిందే. అసలు దానిని తయారు చేయడం దగ్గర నుంచి.. కాంబీనేషన్ వరకు అన్ని ప్రత్యేకమే.
సౌత్ ఇండియాలో ఆంధ్రా భోజనాలకు ప్రత్యేక స్థానముంటుంది. అక్కడి ఫుడ్స్, ఫుడ్స్‌తో పాటు తీసుకునే కాంబినేషన్స్ చాలామంచి రుచిని మీకు అందిస్తాయి. అలా ఆంధ్రాలో ఫేమస్ అయిన ఓ బ్రేక్‌ఫాస్ట్‌నే దిబ్బ రొట్టె. దీనిని ఎక్కడైనా చేసుకుంటారు కదా.. అక్కడే ఎందుకంత ప్రత్యేకం అని అడిగితే.. నిజంగానే దాని రుచి వేరు ఉంటుంది. అంతేకాకుండా దాని చట్నీల కాంబినేషన్‌తో కాకుండా ఓ ప్రత్యేకమైన పదార్థంతో కలిపి తీసుకుంటే దాని టేస్ట్ ఎవరెస్ట్‌ను దాటేస్తుంది. ఇతర రొట్టెలకు దిబ్బరొట్టెకు తేడా ఉందా అంటే కచ్చితంగా ఉంది. దిబ్బరొట్టెను కాస్త దళసరిగా, మందపాటిగా వేస్తారు. మరి ఈ ఫుడ్‌ని ఏ విధంగా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - 350 గ్రాములు
ఉప్పు - తగినంత
జీలకర్ర - 1 టీస్పూన్
నీరు 3 టేబుల్ స్పూన్లు
నూనె - ముప్పావు కప్పు
తయారీ విధానం
దిబ్బరొట్టె చేసుకోవడానికి ప్రత్యేకమైన పిండి తయారు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇడ్లీలు చేసుకోగ మిగిలిపోయిన పిండితో కూడా వేడి వేడి దిబ్బరొట్టె చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీలకు ఏవిధంగా పిండిని తయారు చేస్తామో.. అలా చేసుకుని దానిని రాత్రంతా పులియబెట్టాలి. ఉదయాన్నే దానిని దిబ్బరొట్టె కోసం ఉపయోగించుకోవచ్చు. పిండి పులిస్తే రుచి మంచిగా ఉంటుంది. మీకు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే.. ఫ్రెష్‌గా పిండిని సిద్ధం చేసుకుని ఓ అరగంట తర్వాత పిండిని వంటకు ఉపయోగించుకోవచ్చు. పిండి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు కానీ.. తయారు చేసుకునేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. లేకుంటే దిబ్బ రొట్టె సరిగ్గా రాదు.
కొందరు ఇడ్లీ రవ్వకు బదులుగా బియ్యం రవ్వను దిబ్బరొట్టె కోసం ఉపయోగించేవారు. 1 కప్పు మినపప్పు తీసుకుంటే.. 3 కప్పుల బియ్యం రవ్వ తీసుకునేవారు. దీని టేస్ట్ అయితే మరింత అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా క్రంచీగా ఉంటూ మంచి టేస్ట్‌ను అందిస్తుంది. పల్లీ నూనెను ఈ దిబ్బరొట్టెకు ఉపయోగిస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీనిని నాన్‌స్టిక్ పాన్‌లో చేయడం కంటే.. ఐరన్ పాన్, సీమండి వంటి వాటిల్లో చేస్తే బాగుంటుంది. అయితే మీరు ఎంచుకునే పాత్ర ఎంత మందంగా ఉంటే అంత మంచిగా రొట్టె వస్తుంది.
స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి.. మధ్యలో గ్లాసులాంటింది పెట్టి.. చుట్టూ పిండిని వేయాలి. లేదంటే మొత్తం పిండిని నేరుగా వేసేయొచ్చు. ఇప్పుడు దానిపై, చుట్టూ పక్కల నూనె వేసి మూత పెట్టేయాలి. మంట సిమ్‌లో ఉంచి మీరు మిగతా పని చేసుకోవచ్చు. కొంత సేపటి తర్వాత మూత తీసి.. అడుగున గోల్డెన్ కలర్ వచ్చిందో లేదో చూసి.. దానిని జాగ్రత్తగా మరోవైపు తిప్పి కాల్చాలి. ఇప్పుడు మూత పెట్లాల్సిన అవసరం లేదు. రెండు వైపులా మంచి రంగుతో రొట్టె కాలితే దిబ్బరొట్టె రెడీ అయిపోయినట్లే.
దిబ్బరొట్టెను మీరు బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ ఇలా ఏ సమయంలోనైనా హాయిగా లాగించేయవచ్చు. చాలామంది దీనిని చట్నీలు, పొడుల కాంబినేషన్లో తింటారు కానీ.. గోదావరి జిల్లాల్లో చెరుకు రసంతో పానకం చేస్తారు. ఈ బెల్లం పానకం, దిబ్బరొట్టె అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎప్పుడూ మీరు తినకపోతే.. పానకం తెప్పించుకుని ఈ కాంబినేషన్ ట్రై చేయండి మీరు కూడా ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోతారు.
Also Read : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్లో ఉంటుందట