అన్వేషించండి

Instagram Subscriptions : ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్‌తో డబ్బు సంపాదించండి.. ఫీచర్ పూర్తి వివరాలు, ఎంతమంది ఫాలోవర్లు ఉండాలి?

Instagram Monetization : ఫాలోవర్స్​నే కస్టమర్స్​గా మార్చి.. క్రియేటర్లకు ఆదాయాన్ని అందిస్తుంది ఇన్​స్టాగ్రామ్. అయితే ఈ సబ్​స్క్రిప్షన్స్ గురించిన పూర్తి వివరాల ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కంటెంట్ సృష్టికర్తలు నెలవారీ రుసుముతో ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తారు.
  • సబ్‌స్క్రిప్షన్ కోసం 10,000 మంది ఫాలోవర్లు, 18 ఏళ్లు పైబడిన అర్హత అవసరం.
  • చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేక పోస్ట్‌లు, రీల్స్, లైవ్ వీడియోలు అందుబాటులో ఉంటాయి.
  • యాప్ స్టోర్ కమీషన్ తర్వాత మిగిలిన ఆదాయాన్ని సృష్టికర్తలు పొందుతారు.

Instagram Subscription Eligibility and Earnings : ఈ మధ్యకాలంలో ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ అనే ఆప్షన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బిగ్​బాస్ బ్యూటీలు ఈ ఫీచర్​లో అసభ్యకర పోస్టులు పెట్టి.. డబ్బులు సంపాదిస్తున్నారంటూ రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ ఆప్షన్ ఇప్పుడు వైరల్ అవుతుంది కానీ.. Instagram Subscription వచ్చి చాలా రోజులే అవుతుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఆప్షన్​ కావాలంటే ఎంతమంది ఫాలోవర్లు ఉండాలి? డబ్బులు ఎంత సంపాదించవచ్చో చూసేద్దాం. 

ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ 

ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ అనేది ఒక మానీటైజేషన్ ఫీచర్. దీని ద్వారా మీ ఫాలోవర్లు ప్రతి నెలా ఒక చిన్న ఫీ చెల్లించి మీరు షేర్ చేసే ఎక్స్​క్లూసివ్ కంటెంట్ చూడవచ్చు. దీనివల్ల మీకు నెలకు మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి బ్రాండ్ డీల్స్ కోసం వేచి చూడనవసరం లేదు. 

అర్హత, నిబంధనలు ఇవే 

సబ్​స్క్రిప్షన్  ఫీచర్ పొందాలంటే తప్పనిసరిగా కనీసం 10,000 ఫాలోవర్లు ఉండాలి. వయసు 18 సంవత్సరాలు పైన ఉండాలి. ఇన్​స్టాగ్రామ్ పార్టనర్ మానిటైజేషన్ పాలసీలు పాటించాలి. ఇండియా కూడా సబ్​స్క్రిప్షన్ అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో ఉంది.
10K ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన సబ్​స్క్రిప్షన్ ఆటోమేటిక్​గా రాదు. ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ గ్రాడ్యువల్​గా క్రియేటర్లను సెలెక్ట్ చేస్తుంది. ఆప్షన్ కనిపించకపోతే మీరు ఇంకా వెయిట్ లిస్ట్​లో ఉన్నారని అర్థం. 

సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ ఎలా వర్క్ చేస్తుంది?

ప్రొఫెషనల్ డ్యాష్ బోర్డ్​లోని మానిటైజేషన్ ట్యాబ్​లో Subscriptions అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ నెలవారీ ధరను సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ ప్రొఫైల్ మీద సబ్​స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది. ఫాలోవర్లు దాన్ని నొక్కి ఇన్-యాప్ పర్చేజ్ ద్వారా సబ్​స్క్రైబ్ అవుతారు. అలా సబ్​స్క్రైబ్  అయిన వారికి పర్పుల్ బ్యాడ్జ్ వస్తుంది. కామెంట్స్, DMs లో అది కనిపిస్తుంది. 

సబ్​స్క్రైబర్లను ఎలా ట్రీట్ చేయాలి?

క్రియేటర్లు తమ సబ్​స్క్రైబర్లకు ఎక్స్ క్లూసివ్ పోస్ట్స్, రీల్స్, లైవ్ వీడియోలు, స్టోరీస్, పర్సనలైజ్డ్ అప్డేట్స్ ఇవ్వొచ్చు. ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్ ప్రైస్ లాడర్ ఇస్తుంది. కస్టమ్ అమౌంట్ పెట్టడానికి వీలు లేదు.

నెలకు ఎంత సంపాదించవచ్చు?

ఇన్స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ రెవెన్యూ నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోదు. కానీ యాపిల్, గూగుల్ 30 శాతం తీసుకుంటాయి. అంటే 10 డాలర్ల సబ్స్క్రిప్షన్​కి మీకు 7 డాలర్లు వస్తుంది. 10,000 ఫాలోవర్లతో కేవలం 2% కన్వర్షన్ రేట్​తో కూడా నెలకు 699 డాలర్ల నుంచి 848 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అయితే నెలకు కనీసం 25 డాలర్ల ఆదాయం వచ్చాక ఇన్​స్టాగ్రామ్ పేమెంట్ ప్రాసెస్ చేస్తుంది.

సక్సెస్ టిప్స్

సబ్​స్క్రిప్షన్ ఆప్షన్​ లాంచ్​కి ముందే కంటెంట్ రెడీ చేసుకోండి. కనీసం 2 నుంచి 4 వారాల మెటీరియల్ దగ్గర ఉంచుకోండి. వీక్లీ వర్కవుట్, డైట్ ప్లాన్ అనేవి క్లియర్​గా చెప్పండి. సబ్​స్క్రైబర్లను స్పెషల్​గా ట్రీట్ చేయండి. రెగ్యులర్ పోస్ట్​లు చేయకండి. మిమ్మల్ని సబ్​స్క్రైబ్ చేసిన వారు నిరాశపడకూడదు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget