అన్వేషించండి

Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Tips to Admitting Kids to Hostel : చదువుకోసం పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నారా? అయితే తల్లిదండ్రులు కొన్ని విషయాలపై కచ్చితంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని చెక్ చేయండి. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హాస్టల్ లో పిల్లల భద్రత, సీసీ కెమెరాలు, వార్డెన్ లభ్యత చూడాలి.
  • పిల్లల కోసం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారా తెలుసుకోవాలి.
  • పిల్లల మానసిక స్థితి, హాస్టల్ జీవితానికి సిద్ధంగా ఉన్నారా చూడాలి.
  • చదువుకు అనుకూల వాతావరణం, సైలెంట్ స్టడీ స్పేస్ ఉందా నిర్ధారించుకోవాలి.
  • ఆరోగ్య సదుపాయాలు, అత్యవసర వైద్య సాయం అందుబాటులో ఉందో లేదో చూడాలి.
  • మొబైల్ వాడకం, తల్లిదండ్రులతో మాట్లాడే సమయాలపై నియమాలు తెలుసుకోవాలి.

Check Before Admitting Kids to Hostel : చదువు పెరిగే కొద్దీ.. పిల్లలు పేరెంట్స్​కి దూరమవుతారు. స్టడీకోసం హాస్టల్స్​కి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు పది తర్వాత చాలామంది పిల్లలు హాస్టల్స్​కి వెళ్లాల్సి వస్తుంది. అయితే మీ పిల్లల్ని ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. దానిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి? హాస్టల్లో జాయిన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

హాస్టల్ సేఫ్టీ

పిల్లల భద్రత తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన విషయం. హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయా? వార్డెన్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారా? ఎవరైనా బయటనుంచి వస్తే లోపలికి ఎంట్రీ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి వంటి విషయాలు ముందుగా చెక్ చేసుకోవాలి.

ఫుడ్ క్వాలిటీ 

పిల్లలు ఇంటి నుంచి దూరంగా ఉండబోతున్నారు కాబట్టి వారికి హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పెడతారో తెలుసుకోవాలి. దానిలో ఇప్పటికే ఉన్న పిల్లల నుంచి ఈ విషయం తెలుసుకుంటే మంచిది. ఫుడ్ శుభ్రంగా, పోషకంగా ఉందా లేదా తెలుసుకోండి. కుదిరితే మెస్‌ను డైరక్ట్​గా చూసి మాట్లాడితే మంచిది.

పిల్లల మానసిక పరిస్థితి

కొంతమంది పిల్లలు ఇంటిని, తల్లిదండ్రులను ఎక్కువగా మిస్ అవుతారు. కొంచెం సెన్సిటివ్ ఉంటారు. అలాంటి పిల్లలు హాస్టల్ జీవితానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. బలవంతంగా పంపించడం మంచిది కాదు. అది వారిని మానసికంగా ఇంకా కృంగదీస్తుంది. 

స్టడీకి అనుకూలంగా ఉందా?

హాస్టల్లో పిల్లలు చదువుకు అనుకూలమైన వాతావరణం ఉందా? స్టడీ అవర్స్ సరిగ్గా జరుగుతాయా? సైలెంట్ స్పేస్ ఉందా? వంటి విషయాలు తెలుసుకోవాలి. లేదంటే వారు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

హాస్టల్ సిబ్బంది 

హాస్టల్ సిబ్బంది ప్రవర్తన గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. వార్డెన్లు, టీచర్లు, సిబ్బంది పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారు? సమస్యలు వస్తే వెంటనే స్పందిస్తారా? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్య సదుపాయాలు 

పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్, డాక్టర్ సపోర్ట్, ఎమర్జెన్సీ సదుపాయాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. 

హాస్టల్ ఫీజు

హాస్టల్ ఫీజు గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఎంత ఫీజు తీసుకుంటున్నారు. ఒకవేళ బయటకు వస్తే రిఫండ్ ఇస్తారా? అడ్వాన్స్ ఎంత పే చేయాలి? వంటి విషయాలు కూడా తెలుసుకోవాలి.

మొబైల్, కమ్యూనికేషన్ రూల్స్ 

పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం ఉంటుందా? ఫోన్ వాడకంపై ఎలాంటి నియమాలు ఉన్నాయి? తెలుసుకోవడం మంచిది. ఎమర్జెన్సీ సమయంలో ఎవరినికి కాంటాక్ట్ చేయాలి వంటి విషయాలు తెలుసుకోండి.

ఇవి కూడా తెలుసుకోండి

హాస్టల్‌లో ఉన్న ఇతర పిల్లల ప్రవర్తన, కల్చర్ కూడా మీ పిల్లలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడి వాతావరణం గురించి తెలుసుకోండి. పిల్లల ప్రవర్తన అబ్జర్వ్ చేయండి. హాస్టల్‌కు పంపే ముందు తమ వస్తువులు తామే చూసుకోవడం, టైమ్ మేనేజ్‌మెంట్, శుభ్రత వంటి అలవాట్లు పిల్లలకు నేర్పించాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు పడతారు. హాస్టల్‌లో మొదటి రోజులు పిల్లలకు కష్టంగా అనిపించొచ్చు. కాబట్టి వారితో రెగ్యులర్‌గా మాట్లాడితే వారికి ధైర్యంగా ఉంటుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget