By: Haritha | Updated at : 19 Oct 2022 08:00 AM (IST)
(Image credit: Pixabay)
గాయం తగిలినప్పుడు కొన్ని సెకన్లపాటూ రక్తం వచ్చి, తరువాత రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇది అందరిలో జరిగే ఒక సాధారణ పక్రియ. ఇది గాయం తగిలినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చూపించే ఒక ప్రతి స్పందన. ఇది కణాలను ఒకదానితో ఒకటి కలిపి రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. ఈ గడ్డలు కాసేపటి తరువాత సహజంగా కరిగిపోతాయి. అయితే అవి కరగక పోతే మాత్రం చాలా ప్రమాదం. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధమనుల్లో రక్తం ఎక్కువసేపు గడ్డకడితే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. రక్తం గడ్డలను సహజంగా కరిగించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినడం వల్ల గడ్డలు కరిగిపోతాయి. కొన్ని రకాల పండ్లలో బ్రోమెలిన్, రుటిన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో గడ్డలను సహజంగా కరిగిస్తాయి.
1. ఆపిల్
2. నారింజ
3. నిమ్మ
4. కివీ
5. ద్రాక్ష పండ్లు
ఈ పండ్లు తినడం వల్ల రక్తం గట్ట కట్టిని త్వరగా కరిగిపోతాయి.
కూరగాయలు
పండ్లలోనే కాదు కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల్లో కూడా రక్తం గడ్డకట్టేలా చేసే ఎంజైమ్‌లు ఉంటాయి. ఉల్లిపాయలు, పైనాపిల్స్‌లో కూడా బ్రోమెలిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఇందులోని ప్రొటీన్-డైజెస్టింగ్ ఎంజైమ్ ప్రో-ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే మరికొన్ని రకాల్లో కూడా బ్రోమోలిన్ అధికంగా ఉంటుంది.
1. పాలకూర
2. వెల్లుల్లి
3. రెడ్ వైన్
4. కాలె
రక్తం గడ్డకట్టడాన్ని ఎలా నివారించాలి?
రక్తం గడ్డకట్టడానికి చాలా మంది పసుపును గాయానికి పెట్టుకుంటారు. కానీ పసుపు ఆహారంలో చేర్చుకున్నా చాలు. ఇందులో కర్కుమిన్ ఆరోగ్యంపై యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
అతిగా నిద్రపోతే...
అతిగా నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం ఎక్కువవుతుంది. ఇలా జరుగడం వల్ల ఊపిరితిత్తులు లేదా గుండెలో పల్మోనరీ ఎంబోలిజం పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవుట, మెడ, ఛాతీ, వెన్ను, చేయిలో అసౌకర్యంగా అనిపించడం, ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది. అందుకే రక్తంలో గడ్డలు కట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. రక్తం గడ్డ కట్టడం వల్ల ఒక్కోసారి గుండెకు, మెదడుకు కావాల్సినంత రక్తం చేరదు. దీనివల్ల గుండెపోటు, స్రోక్ వచ్చే అవకాశం ఉంది.
Also read: ప్రజల్లో పెరిగిపోతున్న అయోడిన్ లోపం, ఉప్పు కాకుండా అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్