News
News
X

Weight Loss: కొబ్బరి నీళ్లు ఇలా తాగారంటే త్వరగా బరువు తగ్గుతారు

కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని తాగే పద్ధతిలో తాగితే బరువు కూడా తగ్గుతారు.

FOLLOW US: 
 
అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఎక్కువ మంది చేసే పని కొబ్బరి నీళ్లు తాగడం. నీరసం, లోబీపీ వంటి వాటి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. దీన్ని తాగితే శరీరానికి ఎంతో హాయిగా ఉండడమే కాదు, శక్తి కూడా అందుతుంది. దీన్ని కేవలం అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగే పానీయంలాగే చూస్తారు కానీ అందరూ రోజూ తాగితే చాలా మంచిది. డైటిషియన్ విధి చావ్లా చెబుతున్న ప్రకారం కొబ్బరినీరు శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో కూడా మీకు సహాయపడుతుంది. 

తక్కువ కేలరీలు
కొబ్బరి నీళ్లు ఎన్ని తాగినా బరువు పెరగరు. ఇందులో ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. పొట్ట కూడా తేలికగా ఉంటుంది. ఇందులో పొటాషియం, బయో ఎంజైమ్లు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కనుక చాలా కాలం పాటూ పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.  నిజం చెప్పాలంటే పండ్ల రసాల కన్నా కూడా కొబ్బరి నీళ్లే మంచివి. కొబ్బరినీటిలో అత్యధిక మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. కానీ పండ్ల రసాల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కొంతమంది పంచదారను కూడా కలుపుతారు. అందుకే వాటిని తాగడం వల్ల బరువు పెరుగుతారే కానీ తగ్గరు. కానీ కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. బరువు తగ్గడం సహకరిస్తుంది. 

తిన్నది అరిగేలా...
కొబ్బరినీళ్లలో పోషకాలతో పాటూ పొటాషియం, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును అధికంగా పెంచుతాయి. అంటే తిన్నది అరిగిపోతుంది కానీ కొవ్వు రూపంలో చేరదు. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగితే అది ఊబకాయానికి కారణం అవుతుంది. అందుకే కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. 

అతిగా తినకుండా..
కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.జంక్ ఫుడ్ లాంటివి తినాలన్న కోరికను చంపేస్తుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోనివ్వదు. కాబట్టి సహజంగానే బరువు తగ్గుతారు. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మీ శరీరం నుండి ఎక్కువ సోడియంను బయటకు పంపి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

News Reels

ఎప్పుడు తాగితే బరువు తగ్గుతాం?
డైటీషియన్ విధి చావ్లా ప్రకారం, ఉదయాన్నే ఖాళీ పొట్టతో కొబ్బరి నీళ్లు తాగితే బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ఇది అదనపు కొవ్వును పోగొడుతుంది. బరువు త్వరగా తగ్గాలనుకునే వారు రోజులో మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగాలి. రెండు వారాల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. నెల రోజుల్లో చాలా బరువు తగ్గుతారు. కొబ్బరి నీళ్లు  కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి  చాలా మేలు చేస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో  సహాయపడుతుంది.

Also read: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలనుంటే ఈ చిన్న వ్యక్తిత్వ పరీక్షను తీసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 03 Nov 2022 08:07 AM (IST) Tags: weight loss Coconut water Lose weight Quickely Coconut Water benefits

సంబంధిత కథనాలు

Vitamin E: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!

Vitamin E: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!

Memory: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు

Memory: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు

Heart Attack: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Heart Attack: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Chaksu Seeds: రోజూ ఈ విత్తనాలు తింటే అనారోగ్యాలన్నీ పరార్!

Chaksu Seeds: రోజూ ఈ విత్తనాలు తింటే అనారోగ్యాలన్నీ పరార్!

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

టాప్ స్టోరీస్

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్