Cervical Cancer Vaccine : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట
HPV Vaccine : ఈ మధ్య కాలంలో గర్భాశయ క్యాన్సర్ బాగా హాట్ టాపిక్ అయింది. దీనిని కంట్రోల్ చేసేందుకు బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవాలి అంటున్నారు.. అయితే ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా అని మీకు తెలుసా?
HPV Vaccine for Boys : గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ తెలిపారు. వెంటనే పూనమ్ పాండే ఈ వ్యాక్సిన్ ప్రమోషన్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె చనిపోయినట్లు నాటకమాడి.. అందరినీ టెన్షన్ పెట్టి.. చివరికి హ్యూమన్ పాపిల్లోమావైరస్ గురించి అందరికీ అవగాహన కలిపిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకేనా?
ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా..
గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే హ్యూమన్ పాపిల్లోమావైర్స్ (HPV) వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకేనా అంటే కచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు. సాధారణంగా గర్భాశయ క్యాన్సర్ అంటే కేవలం అమ్మాయిలకి మాత్రమే అనే భ్రమలో ఉంటున్నారని.. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా వేయాలని చెప్తున్నారు. 2006లో తొలిసారిగా HPV వ్యాక్సిన్‌ని ఆమోదించారు. 9 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు దీనిని ఇచ్చేవారు. అయితే 2009లో అబ్బాయిల కోసం HPV టీకాను ఆమోదించారు.
పురుషుల్లో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ
HPV టీకాను అబ్బాయిల కూడా వేయించుకోవాలి అంటున్నారు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తొమ్మిది రకాల HPVలను కవర్ చేస్తుంది. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం లేని అబ్బాయిలు కూడా ఈ టీకాను వేయించుకోవాలి అంటున్నారు. HPV అనేది లైంగిక సంక్రమణ. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌కు, పురుషులలో పురుషాంగ క్యాన్సర్.. స్త్రీ, పురుషులలో గొంతు, నాలుక, టాన్సిల్ క్యాన్సర్లకు కారణమవుతుంది. వీటి లక్షణాలు త్వరగా బయటపడవు. వైరస్‌కు గురైన కొన్నేళ్లకు ఇవి బయటపడవచ్చు. అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ బాలురు, బాలికలకు వేయిస్తే వారిని ఈ క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ప్రతి పదిమందిలో నలుగురు మగవారికి..
HPV సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రతి 10 కేసులలో నలుగురు మగవారు ఉంటున్నారు. ప్రస్తుతం పురుషులలో ఈ క్యాన్సర్లకు స్క్రీనింగ్ లేదు. చికిత్స కూడా లేదు. కాబట్టి వ్యాక్సిన్‌తో మాత్రమే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు. HPV టీకాను 9 నుంచి 26 సంవత్సరాల ఉన్న స్త్రీ, పురుషులందరికీ సిఫార్సు చేస్తున్నారు. మొదటి డోస్ నుంచి రెండో డోస్‌కి 6 నుంచి 12 నెలల తేడా ఉంటుంది.
వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
HPV వ్యాక్సిన్ క్యాన్సర్ నిరోధక ప్రయోజనాలు అందిస్తుంది. వీటిని అన్నిరకాలుగా పరీక్షలు చేసిన తర్వాతే టీకాగా అందిస్తారు. కాబట్టి ప్రతికూల చర్యలు ఏమి ఉండవు. జలుబు, ఫ్లూ వంటి వాటికి తీసుకునే వ్యాక్సిన్ల మాదిరిగానే.. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నొప్పి, ఎరుపు, వాపు, కందడం వంటివి జరుగుతాయి అంతే. అవి కూడా తీవ్రమైనవి కావంటూ తెలిపారు. HPV టీకాను లైంగికంగా పాల్గొనకముందే ఇస్తే చాలా మంచిది. ఒకవేళ లైంగికంగా చురుకుగా ఉన్నా.. ఈ టీకా వైరస్ల నుంచి రక్షించగలదు.
Also Read : బడ్జెట్ సెషన్లో గర్భాశయ క్యాన్సర్ ప్రస్తావన.. వ్యాక్సిన్ వేయించుకోకుంటే అంత ప్రమాదమా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.