ఇది విన్నారా? మందులో మంచింగ్‌తో డిప్రెషన్ దూరం - ఇవి తింటేనే బెనిఫిట్!
కోవిడ్ -19 పాండమిక్ కి ముందు ప్రతి 10 మందిలో ఒకరు డిప్రెషన్ తో బాధపడే వారు ఉండేవారు. ఇది 2021 నాటికి ప్రతి ఆరుగురిలో ఒకరికి పెరిగిపోయింది.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మందిని బాధపెడుతున్న మానసిక సమస్య డిప్రెషన్. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుందట. పురుషులతో పోలిస్తే స్త్రీలు రెండు రెట్లు ఎక్కువగా డిప్రెషన్ తో బాధపడుతున్నారట. అయితే వీరిలో చాలామంది తమకు చికిత్స అవసరమని ఒప్పుకుని చికిత్స తీసుకుంటునేందుకు సుముఖంగా ఉన్నారట. పురుషుల్లో మాత్రం ఇది కాస్త తక్కువే అంటున్నాయి గణాంకాలు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో 15 శాతం మంది థెరపీ లేదా యాంటిడిప్రెసెంట్స్ వాడుతున్నారు. ఇదే పరిస్థితిలో ఉన్న పురుషులతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. అయితే, మీకో ఆసక్తికర విషయం చెప్పాలి. మీకు మందు కొట్టే అలవాటు ఉంటే.. తప్పకుండా మంచింగ్ కూడా అలవాటే ఉంటుంది. మీరు మంచింగ్‌లో తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల మీరు ఎప్పటికీ డిప్రెషన్‌కు గురికారు.
స్పెయిన్ లోని కాస్టిల్లా లా మంచా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రూనో బిజోజెరో పెరోని నేతృత్వంలో జరిపిన ఒక అధ్యయనంలో గింజలు తినడం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు. గింజలు తినడం వల్ల డిప్రేషన్ కు దూరంగా ఉండొచ్చని ఈ అధ్యయనం ద్వారా రుజువులు చూపుతున్నారు. ఇప్పటి వరకు జరిపిన అధ్యయనాలు డిప్రెషన్ మీద ఆహారం ప్రభావం చాలా ఉంటుందని తెలిపాయి. బెర్రీల వంటి యాంటీ ఆక్సిడెంట్ రేట్ ప్లాంట్ బేస్డ్ ఆహారాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.
ఎల్సేవియర్ జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్ లో కొత్త అధ్యయన వివరాలు ప్రచురించారు. ఈ అధ్యయనంలో గింజలు తినడం వల్ల డిప్రెషన్ బారిన పడే వ్యక్తుల్లో ఎలాంటి మార్పు జరిగిందనేది వివరించారు. సాధారణంగా పబ్‌లు, బారుల్లో మందులో మంచింగ్ కోసం కాస్త కారం, ఉప్పు కలిపి కాల్చిన బాదం, జీడిపప్పు, పిస్తా, పల్లీలను ఇస్తుంటారు. ఇవే మీలో డిప్రెషన్‌ను దూరం చేస్తాయ్. రోజూ 30 గ్రాములు లేదా గుప్పెడు గింజలు తిన్న వ్యక్తుల్లో.. అసలు తినని వారి కంటే డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందట.
57 సంవత్సరాల వయసు కలిగి 13,504 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించారు. వీరికి డిప్రేషన్ నిర్ధారణ అయ్యిందా లేక యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నారా అనేది కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 2007 నుంచి 2012 మధ్య వారు తీసుకున్న ఆహారం గురించి తెలుసుకున్నారు. సుమారు 5 సంవత్సరాల పాటు వీరి ఆహారపు అలవాట్లను గమనించి.. ఈ విషయాలు తెలుసుకున్నారు.
గింజలలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాల వల్ల డిప్రెషన్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు గింజల్లో ఆర్జినిక్, గ్లుటమైన, సెరైన్, ట్రిప్టోఫాన్ తో సహా మరిన్ని అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. అందువల్ల అమైనో ఆమ్లాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డిప్రెషన్ పెరిగే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.
Also read : నిద్ర పట్టడం లేదా, మీ జుట్టు ఇలా మారుతోందా? ప్రోటీన్ లోపం కావచ్చు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial