Idli Burger: ఇడ్లీ బర్గర్ కావాలా నాయనా? ఇదిగో ఇలా తయారు చేస్తారు!
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? అయితే, ఇదిగో ఇలా బర్గర్ చేసుకుని తినేయండి. కాస్త కొత్తగా, టేస్టీగా ఉంటుంది.
బర్గర్ అంటే బన్‌తోనే తయారు చేస్తారని అనుకుంటున్నారా? ఇడ్లీతో కూడా చేయొచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే. సాధారణంగా బర్గర్ అంటే.. బన్‌ను నిలువగా కోసి దాని మధ్యలో కూరగాయలు, సాస్, ఆలుటిక్కా లేదా చికెన్ టిక్కాలు, చీజ్ పెడతారు. తినేప్పుడు అది చాలా స్పైసీగా, క్రంచీగా ఉంటుంది. మీకు కూడా ఆ రుచి తెలిసే ఉంటుంది. కానీ, ఇడ్లీతో బర్గర్ అంటే ఎలా ఉంటుందనేగా మీ సందేహం? అయితే, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి.
స్ట్రీట్ ఫుడ్ భాగ్యనగర్ (Street food Bhagyanagar) ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందుకు మీకు కావల్సింది జస్ట్ రెండు ఇడ్లీలు, ఆలు టిక్కా, చట్నీ, వెజ్ మయోనేజ్ ఉంటే చాలు. ముందుగా ఒక పెద్ద సైజు ఇడ్లీ తీసుకుని దానికి స్పైసీ చట్నీ రాయాలి. ఆ తర్వాత వెజ్ మయోనేజ్ పెట్టాలి. దానిపై ఆలు టిక్కా పెట్టి, మళ్లీ వెజ్ మయోనేజ్, చట్నీ, కాస్త టమోటా సాస్ రాసి.. దానిపై మరో ఇడ్లీ పెడితే చాలు.. ఇడ్లీ బర్గర్ రెడీ.
View this post on Instagram
Also read: ఇచ్చిన బొమ్మలో మీ మెదడు మొదట ఏం గమనించింది? దాన్ని బట్టి మీ మనసు ఎలాంటిదో చెప్పవచ్చు