Instagram: ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులే డబ్బులు.. ఇదిగో ఇలా సంపాదించండి
యూట్యూబ్ ద్వారా ఇప్పటికే చాలా మంది లక్షలు వెనకేసుకుంటున్నారు. అలాగే ఇన్ స్టాగ్రామ్ ద్వారా బోలెడన్నీ డబ్బులు సంపాదించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
ఇన్స్టాగ్రామ్ ద్వారా కేవలం విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా వంటి సెలెబ్రిటీలు మాత్రమే డబ్బులు సంపాదించగలరన్నది అపోహ. కాస్త కష్టపడితే సామాన్యులు కూడా డబ్బులు సంపాదించవచ్చు. దానికి ముందుగా మీరు చేయాల్సింది ఇన్ స్టాలో ఇన్ ఫ్లూయెర్ గా మంచి గుర్తింపు సాధించాలి.
సెలెబ్రిటీకైనా, సామాన్యుడికైనా ఇన్ స్టాలో ఖాతా తెరిచే విధానం ఒక్కటే. సెలెబ్రిటీల ఫోటో చూస్తే చాలు గంటల్లో వేల మంది ఫాలోవర్లు వచ్చేస్తారు. సామాన్యుడికి అలా రావడం కష్టం. అదొక్కటే తేడా. మీరు కూడా ఇన్ స్టాలో ఫాలోవర్లను పెంచుకుంటే సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.
Also read: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లైవ్ అప్‌డేట్స్.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే
ఎలా ఫేమస్ అవ్వాలి?
మీరు బాగా వంటలు చేయగలరా? లేక డ్యాన్స్ చేస్తారా? ట్రావెలింగ్, ట్రెక్కింగ్... ఇలా మీకు ఏది ఇష్టమో ఆ రంగంలోనే అందమైన పోస్టులు పెట్టండి. అవి కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉండాలి. మీ పోస్టులు, ఫోటోలు నచ్చితే ఫాలోవర్లు క్రమంగా పెరుగుతూ వస్తారు. హ్యాష్ ట్యాగులతో ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చూడాలి. లక్ష మంది వరకు ఫాలోవర్లు చేరుకుంటే మీరు కూడా ఇన్ ఫ్లూయర్ గా మారినట్టే.
లక్షల కొద్దీ ఫాలోవర్లుండే సెలెబ్రిటీలంతా ఇన్ ఫ్లూయెర్స్ కోవలోకే వస్తారు. వీళ్లు ఒక్క పోస్టు పెడితే దాన్ని చూసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కనుక కొన్ని బ్రాండ్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తమ బ్రాండ్ గురించి పోస్టులు పెట్టించుకుంటాయి. మీకు కూడా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే కొన్ని బ్రాండ్లు మిమ్మల్ని కాంటాక్ట్ అయి ప్రచారం చేయమని కోరతాయి. అందుకు మీకు మంచి రెమ్యునరేషన్ ను కూడా అందిస్తాయి.
Also read: ఏం కావాలన్నా ఇంటికే తెచ్చిపెట్టే గ్రామీణ స్టార్టప్.. డెలివరీ ఛార్జ్ ఒక్క రూపాయే
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా కొంత డబ్బును సంపాదింవచ్చు. దీనికి కూడా మీకు వేలల్లో ఫాలోవర్స్ ఉండాలి. ఏదైనా ఉత్పత్తి తాలూకు అమ్మకపు లింకును మీ ఇన్ స్టా బయోలో ఇవ్వాలి. దాని క్లిక్ చేసి, వెబ్ సైట్ లోకి వెళ్లి ఎవరైనా కొంటే మీకు కొంత మొత్తం కమిషన్ గా వస్తుంది. దీనికోసం అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అఫిలియేట్ గా నమోదు అవ్వాలి. అంతేకాదు మీకు వేల కొద్దీ ఫాలోవర్లుంటే మీ సొంత ఉత్పత్తులను ఇన్ స్టాగ్రామ్ లో అమ్ముకోవచ్చు.