Bigg Boss Telugu Season 5 Live: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లైవ్ అప్‌డేట్స్.. 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి.. కథ వేరే ఉంటదట!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మరికొన్ని నిమిషాలు మొదలువుతుంది. హోస్ట్ నాగార్జున ముందుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వెళ్తారు.
LIVE
Background
బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సందడి మొదలైపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రోమో విడుదలైన గంటలోనే మూడు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ఒక్కో కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. వారి కంటే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌస్ లోపల కంటెస్టెంట్స్ ఉండే గదులు, కన్ఫెషన్ రూమ్, కిచెన్, ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, జైల్‌ను నాగ్ చూపిస్తారు. ఆ తర్వాత సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్ సిరితో ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చివర్లో యాంకర్ రవి డ్యాన్స్‌తో ముగుస్తుందని సమాచారం. అలాగే.. ఈ రోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల జాబితా కూడా ఆన్‌లైన్ లీకైంది.
చివరిగా ‘రోల్ బేబీ రోల్’ టాస్క్
‘సింగిల్ బెడ్’ టాస్క్ కోసం ‘రోల్ బేబీ రోల్’ టాస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో మానస్ విజేతగా నిలిచాడు. చివరి టాస్కులో నాలుగు బాక్సులు పెట్టారు. అందులోని ఒక బాక్సులో సింగిల్ బెడ్‌కు వేసిన తాళాన్ని తెరిచేందుకు కీని పెట్టారు. విశ్వ తీసుకున్న బాక్సులో ఆ కీ ఉండటంతో విశ్వకు సింగిల్ బెడ్ లభించింది. దీంతో చివరి టాస్క్ పూర్తయ్యింది.
19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి
హౌస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ‘‘నీకు పెళ్లయ్యిందని నాకు తెలీదు. నాకు కూడా చెప్పలేదు. పెళ్లిలా ఇంకా ఎన్ని సీక్రెట్లు దాచి పెట్టావు?’’ అని అడిగారు. ‘‘హౌస్‌లో రియల్‌గా ఉండాలని అనుకుంటున్నా’’ అని రవి ఈ సందర్భంగా తెలిపాడు. నాగ్ సర్‌ప్రైజ్‌గా రవి కుమార్తె పంపిన గ్రీటింగ్‌ను ఇచ్చారు. పాప వాయిస్ మెసేజ్‌ను స్టేజ్ మీద వినిపించారు. దీంతో రవి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం రవి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు.
18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ
హౌస్‌లోకి 18వ కంటెస్టెంట్‌గా సినీ నటి శ్వేతా వర్మ అడుగు పెట్టింది. ‘బాహుబలి’ సినిమాలోని ‘‘ధీవరా..’’ పాటతో స్టేజ్ మీదకు వచ్చింది. నాగ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నన్ను ట్రిగర్ చేస్తే.. దేత్తడి పోచమ్మ గుడే.. ఇచ్చి పడేస్తా’’ అంటూ సంకేతాలు పంపింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లింది.
17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్
చక్కని ఏవీతో అడుగుపెట్టింది కాజల్. కట్టుబాట్ల పరదాను దాటి.. మతాంతర వివాహంతో తన జీవితం గురించి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేజ్ మీద గల గల మాట్లాడేస్తూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగార్జునతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోవాలనే కోరికను తీర్చుకుంది. గాయని జానకి గొంతుతో ‘‘నరుడు ఓ నరుడా’’ పాట పడింది. అనంతరం హౌస్‌లో అడుగు పెట్టింది.
16వ కంటెస్టెంట్‌గా మానస్
హౌస్‌లోకి 16వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు మానస్ అడుగుపెట్టాడు. ఆరు అడుగుల బుల్లెట్ పాటతో స్టైలిష్‌గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు.