Covid-19 On Men: కోవిడ్ ఎఫెక్ట్: ‘అది’ చిన్నదైపోతోంది, లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, కారణాలు కనుగొన్న డాక్టర్లు!
కోవిడ్-19 పురుషులపై పగబట్టింది. అంగం సైజు తగ్గించమే కాకుండా.. కనీసం సెక్సు కూడా పనికి రాకుండా పురుషుల జీవితాలతో ఆటలాడుతోంది.
కోవిడ్-19 వైరస్‌ను ఇప్పుడు మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. ఏముందిలే జస్ట్ జలుబులా వచ్చిపోతుందిలే.. అనే ధీమా ప్రతి ఒక్కరిలో పెరిగింది. దీంతో మాస్కులు పెట్టుకోకుండానే స్వేచ్ఛగా తిరుగున్నారు. సానిటైజర్లను వాడటం కూడా మానేశారు. కానీ, కోవిడ్-19 కేవలం శ్వాసకోస వ్యవస్థపైనే కాదు.. శరీరంలోని ప్రతి అవయవంపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో మగతనానికి ఇది ఛాలెంజ్ విసురుతుంది. పురుషాంగం కుచించుకుపోయేలా చేస్తుంది. చివరికి.. అంగస్తంభన కూడా కష్టతరం చేస్తుంది. ఈ విషయాలను స్వయంగా వైద్యులే తెలిపారు.
యూకేకు చెందిన యూరాలజిస్ట్, పెల్విక్ సర్జన్ డాక్టర్ రీనా మాలిక్ news.com.auతో మాట్లాడుతూ.. ‘‘వైరస్‌తో పోరాడిన తర్వాత చాలా మంది పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్నారు. మీకు కోవిడ్ -19 వచ్చినప్పుడు అది రక్త నాళాల పొరను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శరీరంలోని ఒక భాగం నుంచి మరోదానికి రక్తాన్ని అందించడంలో సమస్యలు ఏర్పడుతాయి. పురుషాంగానికి సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కోవిడ్-19 తర్వాత అంగస్తంభన ముప్పు ఐదింతలు అవుతుంది. అంగానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల కుచించుకుపోయే ప్రమాదం ఉంది’’ అని తెలిపారు.
‘‘కోవిడ్-19 తీవ్రత పెరిగే కొద్ది మీరు అంగానికి వెళ్లే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడి కణజాలం సంకోచానికి గురవ్వుతుంది. ఫలితంగా పురుషాంగం పొడవు తగ్గిపోతుంది. మెల్‌బోర్న్‌కు చెందిన ఓ కోవిడ్ బాధితుడు స్థానిక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. వైరస్ సోకిన తర్వాత అంగస్తంభన చాలా కష్టమనిపిస్తోందని తెలిపాడు. కోవిడ్‌కు ముందు తాను సుమారు 30 నిమిషాలు సెక్స్ చేసేవాడినని, ఇప్పుడు అది 10 నిమిషాలకు పడిపోయిందని పేర్కొన్నాడు.
‘వరల్డ్ జర్నల్ ఆఫ్ మెన్స్ హెల్త్’లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కోవిడ్ -19 సోకిన తర్వాత పురుషాంగ రక్తనాళాలు దెబ్బతిన్న రోగులను పరిశీలించారు. వీరిని వైరస్ సోకని ఇద్దరు వ్యక్తులతో పోల్చారు. కోవిడ్ సంక్రమణ తర్వాత కొన్ని నెలల వరకు వైరస్ పురుషాంగంలో కొనసాగుతుందని, సెక్స్ చేయడం కష్టంగా మారుతుందని తేలింది. కోవిడ్ -19 నుంచి కోలుకున్న బాధితుల్లో ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా.. వారి పురుషాంగ కణజాలంలో మాత్రం ఇంకా కరోనావైరస్ కణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. కోవిడ్ మగాళ్లపై పగ బట్టేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి అందరిలో ఉంటే.. భవిష్యత్తులో సంతాన సమస్యలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.
Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఇవి వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయాలు కాదు. మీకు ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.