Snake Infestation: పామును పట్టుకోబోయి ఇల్లు తగలెట్టేసిన యజమాని..
ఇంట్లో పాములు కనిపించగానే ఎవరైనా పాములు పట్టేవారిని పిలుస్తారు. కానీ ఆ ఇంటి యజమాని ఏకంగా ఇంటికే నిప్పంటించేశాడు. అసలేం జరిగిందంటే...
యూఎస్ మోంట్‌గోమెరీ కౌంటీ, మేరీల్యాండ్ లో ఓ ఇంట్లో పాములు కలకలంరేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పాములు పట్టేవారిని పిలిచి వాటిని పట్టించి దూరంగా విడిచిపెడతారు. కానీ ఆ ఇంటి యజమాని ఓ విపరీత ఆలోచన చేశాడు. పొగపెట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. ఎంతసేపటికీ పాములు బెడద తగ్గకపోవడంతో డోస్ పెంచాడు. దీంతో ప్రమాదవశాత్తూ ఏకంగా ఇల్లంతా మంటలు చెలరేగాయి.
ICYMI - Update Big Woods Rd, house fire 11/23; CAUSE, accidental, homeowner using smoke to manage snake infestation, it is believed heat source (coals) too close to combustibles; AREA of ORIGIN, basement, walls/floor; DAMAGE, >$1M; no human injures; status of snakes undetermined https://t.co/65OVYAzj4G pic.twitter.com/xSFYi4ElmT
— Pete Piringer (@mcfrsPIO) December 3, 2021
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్, కాలిపోయిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం మిలియన్ కన్నా ఎక్కువ ఉండొచ్చని అంచనా.
2018లో ఓ వ్యక్తి తన ఇంట్లో ఎక్కడంటే అక్కడ కనిపించే సాలె పురుగులను చంపేందుకు ప్రొపేన్ బ్లోటోర్చ్‌ని ఉపయోగించాడు. ఆ మంటలు అదుపుతప్పి ఏకంగా ఇల్లు కాలిపోయింది. నాలుగు నెలల క్రితం ఓ భర్త తన భార్యకు వాటా రాకూడదనే కక్షతో ఇంటికి నిప్పుపెట్టాడు. ఏదేమైనా పాముల బెడదనుంచి బయటపడేందుకు పొగపెట్టి ఇల్లు కాలిపోయిన ఘటన తాలూక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
Also Read: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Also Read: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...
Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి