అన్వేషించండి

Brain Infections: రైన్ ఎఫెక్ట్ - వామ్మో, పిల్లల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయా? డాక్టర్లు చెప్పిన ఈ కారణాలు తెలిస్తే షాకవుతారు!

వర్షాకాలంలో చిన్న పిల్లల్లో ఈజీగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అధిక తేమ, దోమల పెరుగుదల కారణంగా వారిలో మెదడు సంబంధ సమస్యలు తలెత్తుతాయంటున్నారు.

Brain Infections In Children: వర్షాకాలంలో మెదడు సంబంధ వ్యాధుల విజృంభణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికత తేమ, దోమల పెంపకం కారణంగా మెదడు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అధిక తేమ, దోమల పెరుగుదల కారణంగా వైరల్ ఎన్‌సెఫాలిటిస్ తో పాటు ఇతర మెదడు ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు.

పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు

బాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్న జీవుల కారణంగా ఎన్సెఫాలిటిస్ తో పాటు పలు మెదడు సంబంధ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్సెఫాలిటిస్ కారణంగా తీవ్రమైన తల మంటతో మెదడు కణజాలానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. నరాల సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫాలిటిస్ లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లకు వాహకాలుగా దోమలు ఉంటాయి. వర్షాకాలంలో దోమల వృద్ధి చెందడం వల్ల మెదడు ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్ణాటక, ఒరిస్సా లాంటి తీర ప్రాంతాలతో పాటు అస్సాం, త్రిపుర లాంటి ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఉత్తర ప్రదేశ్  లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వైరల్ ఎన్సెఫాలిటిస్‌ విజృంభించింది. చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు.. వైరల్, బ్యాక్టీరియా, ట్యూబర్‌క్యులర్, ఫంగల్, ప్రోటోజోల్ సహా పలు రకాలుగా ఉంటాయి.

బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు

మెదడు ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో అత్యంత సాధారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, వృద్ధులలో బలహీనమైన ఇమ్యూనిటీ సిస్టమ్ కారణంగా మెదడు సంబంధ వ్యాధుల బారిన ఈజీగా పడుతారు. వర్షాకాలంలో పిల్లల్లో దద్దుర్లు, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాల పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత త్వరగా వైద్యులకు చూపించాలి. దోమల వృద్ధిని అడ్డుకోవడంతో పాటు దోమలు కరువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు.

పిల్లలు విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు

మెదడు సంబంధ వ్యాధుల చికిత్సలు..  ఆయా వ్యాధులు సోకే రకం, కారణం మీద ఆధారపడి ఉంటుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా యాంటీబయాటిక్స్‌ తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్, డెంగ్యూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా యాంటీవైరల్ మెడిసిన్స్ తో తగ్గుతాయి. ట్యూబర్‌కులర్ బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్లకు చాలా కాలం పాటు యాంటీ ట్యూబర్‌క్యులోసిస్ డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తో చికిత్స తీసుకోవచ్చు. ఆయా వ్యాధుల తీవ్రత పెరిగితే ఐసీయూ ట్రీట్మెంట్ తో పాటు ఆపరేషన్ కూడా అవసరం కావచ్చని వైద్యులు తెలిపారు. వ్యాధులు సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, రోగాలు రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా దోమలను అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు. చిన్న పిల్లలను వీలైనంత వరకు పొడి, వెచ్చని ప్రదేశాల్లో ఉండేలా చూడాలంటున్నారు.

Read Also: 5 రోజులు, 6 మరణాలు - చండీపురాను వణికిస్తున్న వైరస్, చికిత్స లేని ఈ వ్యాధి లక్షణాలేంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget