Social Media Effects on Children : పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే
Online safety for Children : చిన్నపిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. దాని లాభనష్టాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

Children Smartphone Usage : స్మార్ట్‌ఫోన్‌లు, తక్కువ ధరలో ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న డిజిటల్ యుగం ఇది. ఈ సమయంలో పిల్లలు ఫోన్ ఉపయోగించడమే కాదు.. సోషల్ మీడియాను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే పిల్లలను స్క్రీన్‌లకు పరిచయం చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని లేదా.. పిల్లల సేఫ్టీ కోసం పేరెంట్స్ ఫోన్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఆ సమయంలో పిల్లలు ఏమి చూస్తున్నారో.. ఏమి చేస్తున్నారో అనేది వారికి కనీస అవగాహన ఉండకపోవచ్చు.
కనీస వయసు లేకుండానే..
2021లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనీస వయస్సు 13 సంవత్సరాలు ఉండాలి. అయినప్పటికీ 10 సంవత్సరాల పిల్లలలో 37% మంది Facebookలో, 24% మంది Instagramలో ఉన్నారు. ఈ పిల్లలలో చాలా మంది ఆన్‌లైన్ విద్య, స్టడీ మెటీరియల్స్, గేమ్‌లు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి సొంత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. YouTube, Facebook, Instagram, Snapchat వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్
పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడం పిల్లల మనస్తత్వంపై ప్రభావం చూపిస్తుంది. కొందరికి ఇది హెల్తీగా ఉంటే మరికొందరిని టాక్సిక్ వైపు తీసుకెళ్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఇది పిల్లల వ్యక్తిగత స్థితిలో మార్పులు తీసుకువస్తుంది. సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే గడుపుతారు. చదువుపై ఆసక్తి ఉండకపోగా మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే నష్టాలుకూడా ఎక్కువే ఉన్నాయి. అవేంటంటే..
సోషల్ మీడియాలో పిల్లలకు మేలు చేసే అంశాలు
ఈ పోటీ ప్రపంచంలో సొంత గుర్తింపు చాలా అవసరం. పిల్లలకు సోషల్ మీడియా ఆ వేదికను అందిస్తుంది. ఒకే రకమైన ఇష్టాలు లేదా అనుభవాలు ఉన్నవారితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఒంటరిగా ఉన్న లేదా ఆఫ్‌లైన్‌లో కుటుంబ సహాయం లేని పిల్లలకు ఒక ఇది వరంలా మారుతుంది. మైనారిటీలు, LGBTQ కమ్యూనిటీ, విభిన్న సామర్థ్యం ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు తమను తాము వ్యక్తపరచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారు తమ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడవచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే సహాయం కోరేందుకు కూడా హెల్ప్ అవుతుంది.
సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు
ట్వీన్ దశలో ఉన్న పిల్లలు ఏ కంటెంట్ ఎలాంటిదనే అంచనా వేయలేరు. దీనివల్ల పిల్లలు అనుచితమైన లేదా బాధ కలిగించే కంటెంట్‌ను చూసే అవకాశాలు ఎక్కువ. లేనిపోని వివాదాల్లో చిక్కుపోయే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తులో పిల్లల ఆలోచనా విధానంపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశం, విదేశాలలో అనేక అధ్యయనాలు కూడా రోజుకు మూడుసార్లకు మించి సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల ట్వీన్‌ల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హైలైట్ చేశాయి. తమని తాము హార్ట్ చేసుకోవడం, చిరాకు, ఆందోళన వంటివి పెరుగుతాయి. డిప్రెషన్, అటెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.
కాబట్టి పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారో పేరెంట్స్ తెలుసుకోవాలి. ఒకవేళ్ల పిల్లలకు సోషల్ మీడియా ఉంటే..దానిలో కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. పిల్లలు సోషల్ మీడియాలో ఏమి చూస్తున్నారు.. ఎవరిని ఫాలో అవుతున్నారనే.. ఒక వయసు వచ్చేవరకు ట్రాక్ చేయడం మంచిది. వాడకం విషయానికి వస్తే కొన్ని నియమాలు, పరిమితులు విధించాలని సూచిస్తున్నారు నిపుణులు.























