Room Heaters at NighT : రాత్రంతా హీటర్ ఆన్ చేయడం ప్రమాదమా? ప్రాణాలను కాపాడుకోగలిగే టిప్స్ ఇవే
Heater Night Risk You Didn’t Know : శీతాకాలంలో చలి నుంచి రక్షించడానికి హీటర్లను ఉపయోగిస్తారు. చాలా మంది రాత్రిపూట హీటర్లను ఆన్ చేసి నిద్రపోతారు. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..

Winter Heater Danger Alert : చలి బాగా పెరిగిపోయింది. టెంపరేచర్ బాగా డౌన్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో చాలామంది చలి నుంచి రక్షించుకోవడానికి హీటర్లను ఉపయోగిస్తారు. అలాగే వింటర్లో వెచ్చగా ఉండేందుకు హీటర్లు ఉపయోగించడం సర్వసాధారణం. దీనిలో భాగంగా చాలా మంది రాత్రుళ్లు హీటర్లు ఆన్ చేసి చలిని దూరం చేసుకుని.. హాయిగా నిద్రపోతారు. దీనివల్ల చలి తగ్గుతుంది. కానీ హీటర్లు రాత్రంతా అలా ఉంచేసి పడుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు. రాత్రిపూట హీటర్లను ఆన్ చేయడం వల్ల శరీరం, చుట్టు పక్కల ప్రాంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు.
నిరంతరం హీటర్లను ఉపయోగిస్తే
గదిలో ఎక్కువసేపు హీటర్లను ఉపయోగించడం వల్ల గాలిలోని తేమ తగ్గిపోతుంది. గాలి పొడిగా మారినప్పుడు.. చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. పెదాలు పొడిబారిపోతాయి. గొంతు బిగుసుకున్నట్లు అనిపిస్తుంది. దీనితో పాటు పొడి గాలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలను కూడా పెంచుతుంది. అందుకే డాక్టర్లు రాత్రిపూట హీటర్లను ఉపయోగించవద్దని సలహా ఇస్తారు.
ఆక్సిజన్ స్థాయి తగ్గిస్తుంది
మూసిన గదిలో హీటర్లను నిరంతరం ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల తలనొప్పి, మైకం, అలసట కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి స్పృహ కోల్పోయే వరకు వెళ్ళవచ్చు. గ్యాస్ హీటర్లు లేదా కాయిల్ హీటర్ల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు కూడా విడుదలవుతాయి, ఇవి ప్రాణాంతకం కావచ్చు.
ఈ చిట్కాలతో ఫాలో అయితే మంచిది
రాత్రుల్లు హీటర్లను ఉపయోగించడం అవసరమైతే.. ఆరోగ్య సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మొదట గాలి ప్రసరణ కోసం గదిలో కొంచెం వెంటిలేషన్ ఉంచండి. అదనంగా తేమను నిర్వహించడానికి గదిలో హ్యూమిడిఫైయర్ లేదా నీటితో నిండిన పాత్రను ఉంచండి. నిద్రపోయేటప్పుడు హీటర్‌ను టైమర్ మోడ్లో సెట్ చేయండి. దీనివల్ల హీటర్ కొన్ని గంటల తర్వాత ఆగిపోతుంది.
ప్రత్యామ్నాయం ఉందా ?
చలి నుంచి ఉపశమనం పొందడానికి ఎలక్ట్రిక్ దుప్పటి లేదా వేడి నీటి బాటిల్.. హీటర్ల కంటే మంచిదని నిపుణులు భావిస్తున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయట. అలాగే గాలిని పొడిగా చేయవు. రాత్రిపూట హీటర్లను ఉపయోగించడం సౌకర్యంగా అనిపించినప్పటికీ దాని ప్రమాదాలు తీవ్రంగా ఉండవచ్చని చెప్తున్నారు.
.




















