అన్వేషించండి

Hair Causes in Women : మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఇవే

Hair Care Tips : జుట్టు రాలే సమస్య చాలామందిలో ఉంటుంది. అయితే దానికి గల కారణాలు మాత్రం ఎవరూ గుర్తించరు. ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

Hair Loss Causes : వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో జుట్టు రాలే సమస్య ఉంటుంది. అయ్యో మా జుట్టు రాలిపోతుంది అనేవారే తప్పా దానికి గల కారణాల గురించి ఎవరూ పెద్ద ఆలోచించరు. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడానికి చిట్కాల గురించి పరిశోధించడం కన్నా జుట్టు ఎందుకు రాలిపోతుందనేదానికి గల కారణాలు గుర్తించాలి అంటున్నారు నిపుణులు. అప్పుడే మీరు సరైన పద్ధతిలో జుట్టును కాపాడుకోవచ్చని చెప్తున్నారు. 

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమం. అంతకంటే ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలి. వృద్ధాప్య ప్రక్రియలో జుట్టు పెరుగుదలలో మార్పులు ఉంటాయి. జుట్టు పెరగడం మందగిస్తుంది. అయితే జుట్టు రాలడాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జెనిటికల్..

ఆండ్రోజెనిటిక్ అలోపేసియా అనేది జుట్టు రాలడంలో అత్యంత సాధారణమైన కారణం. దీనివల్ల జన్యు, హార్మోన్ల ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. ఇవి వారి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలను నియంత్రిస్తాయి. కాలక్రమేణా స్కాల్ప్​లోని ఫోలికల్స్ క్రమంగా తగ్గిపోవడాన్ని ప్రేరేపిస్తుంది. ఇది బాధితుల జుట్టు సన్నగా, పొట్టిగా మారడానికి కారణమవుతుంది. పరిస్థితి అభివృద్ధి చెందుతున్నప్పుడు బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. 

ఒత్తిడి

ఒత్తిడి వివిధ కారణాలతో వస్తుంది. కానీ ఒత్తిడి జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. ఇలా జరిగే ప్రక్రియను టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ఇది శారీరక, మానసిక, భావోద్వేగ వంటి తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా వస్తుంది. దీనివల్ల మీ జుట్టు పెరుగుదల తాత్కాలికంగా ఆగిపోవచ్చు. అధిక జ్వరం, పలు ఇన్​ఫెక్షన్లు, బరువు వేగంగా తగ్గిపోవడం, గర్భనిరోధక మాత్రలు శరీరంలో టెలోజెన్ ఎఫ్లూవియం ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి. ఐరన్, విటమిన్ డి, బయోటిన్ లేదా జింక్ వంటి పోషకాహార లోపాలు కూడా జుట్టు పెరుగుదలను నియంత్రిస్తాయి. 

స్టైలింగ్ 

హీట్ ప్రొడెక్ట్స్​ ఎక్కువగా వినియోగించడం వల్ల జుట్టు రాలిపోతుంది. అంతేకాకుండా జుట్టు నిర్జీవంగా మారి లుక్​ని మార్చేస్తుంది. అంతేకాకుండా ముడి వేసుకోవడం, పోనిటెయిల్స్ వంటివి వేసుకున్నప్పుడు జుట్టును వెనక్కి వెళ్లిపోతుంది. జుట్టు రాలిపోయి.. బట్టతల ఎక్కువైపోతుంది. ఫోలికల్స్ బలహీనపడి.. చివరికి జుట్టురాలడం శాశ్వతంగా మారిపోతుంది. సైడ్స్​కూడా జుట్టు రాలిపోయి.. బట్టతల రావడం ప్రారంభమవుతుంది. ఇలా టైట్​గా జుట్టుని కట్టడం వల్ల చివర్లు కూడా చిట్లిపోతుంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా జుట్టు రాలడాన్ని ప్రోత్సాహిస్తాయి. 

కెమికల్ ట్రీట్​మెంట్స్

హీట్ స్టైలింగ్ కాకుండా చాలామంది కెమికల్ ట్రీట్​మెంట్​లు చేయించుకుంటారు. మీ రెగ్యూలర్ హెయిర్ స్టైల్​లో ఇది భాగమైతే.. మీ తంతువులకు హాని కలిగించే ప్రమాదముంది. ట్రైకోర్​హెక్సిస్​ నోడోసా అనే హెయిర్ షాఫ్ట్ డిజార్డర్​ను అభివృద్ధి చేసే ప్రమాదముంది. ఇది జుట్టును బలహీనం చేసి జుట్టు రాలిపోవడాన్ని పెంచుతుంది. అంతర్లీన పోషకాహార లోపాలు కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. 

చుండ్రు 

చుండ్రు ఉంది అంటే జుట్టు రాలడం చాలా కామన్ అని అర్థం. ఇది చర్మంపై దద్దుర్లను కూడా క్రియేట్ చేస్తుంది. అలాగే స్కాల్ప్​పై దురద, పొరలుగా ఉండే పాచెస్​లతో మచ్చలు ఏర్పడతాయి. తలలో ఉండే సహజమైన గ్రంథులు మూసుకుపోయి జుట్టు పొడిబారిపోతుంది. ఇది తలలో మలాసెజియా ఈస్ట్​ను పెంపొందించి జుట్టు రాలడాన్ని తీవ్రతరం చేస్తుంది. 

హెయిర్ ఫోలికల్స్ 

ఫోలిక్యులిటిస్ అనేది హెయిర్ ఫోలికల్స్ ఎర్రబడినప్పుడు వస్తాయి. ఇది శరీరక చికాకు, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే చర్మ పరిస్థితి. కొన్నిసార్లు ఇది త్వరగా వెళ్లిపోతుంది. కానీ దీనిలో రెండో రకం వస్తే అది మరింత తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటుంది. పైగా దీర్ఘకాలం ఉంటుంది. ఫోలికల్ ఎర్రబడినప్పుడు సాధారణ జుట్టు పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. ఇది జుట్టు పూర్తిగా రాలడానికి హెల్ప్ చేస్తుంది. 

హార్మోన్ల ప్రభావం

మహిళల్లో జుట్టు రాలడానికి హార్మోన్ల మార్పులు దోహదపడతాయి. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పెరిమెనోపాజ్​తో సంబంధం ఉన్న అధిక, హెచ్చుతగ్గుల ఆండ్రోజెన్ స్థాయిలు ఇబ్బంది కలిగిస్తాయి. దీనివల్ల పీరియడ్స్ రెగ్యూలర్​గా రావు. ఇది జుట్టు పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగించవచ్చు. 

Also Read : PCOS ఉన్న మహిళల్లో సూసైడ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట.. న్యూ స్టడీ రిజల్ట్స్ ఇవే

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget