అన్వేషించండి

Womens Health : PCOS ఉన్న మహిళల్లో సూసైడ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట.. న్యూ స్టడీ రిజల్ట్స్ ఇవే

Hormone issues in Women : హార్మోన్ల ప్రభావం మహిళల్లో ఇంతగా ఉంటుందా అనిపించేలా చేసింది తాజా అధ్యాయనం రిజల్ట్స్. ఇది వారిలో సూసైడ్ ఆలోచనలు పెంచుతున్నట్లు తేల్చింది. 

Reproduction : మహిళల్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం హార్మోన్ల ప్రభావమే. అయితే వీటి ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తేల్చింది కొత్తగా నిర్వహించిన ఓ అధ్యయనం. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళలు.. హార్మోన్ల పరిస్థితి సాధారణంగా ఉండే మహిళల కంటే ఆత్మహత్యకు ప్రయత్నించే అవకాశం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. 

లక్షణాలు ఇవే..

PCOS స్త్రీ సంతానోత్పత్తి, రూపాన్ని ప్రభావితం చేస్తుంది. PCOS సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో ఇది 8 శాతం నుంచి 13 శాతం మందిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గర్భం దాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యే వరకు చాలామందికి ఈ రుగ్మత ఉందని కూడా తెలియదు. పిల్లలు పుట్టట్లేదని ఇబ్బంది పడేవారిలో చాలామందికి ఈ సమస్య ఉంటుంది. మొటిమలు రావడం, ముఖంపై జుట్టు పెరుగుదల అధికంగా ఉండడం, ఊబకాయం, పీరియడ్స్ సమయానికి రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వారి జీవన నాణ్యతను బాగా దెబ్బతీస్తాయి. 

తాజాగా అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్​లో ఓ అధ్యయనం గురించి ప్రచురించారు. ఈ న్యూ స్టడీ ప్రకారం.. PCOS బాధితుల్లో ఆత్మహత్య ప్రయత్నాల ప్రమాదం 8.47 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా నయం చేయలేని, చికిత్స చేసేందుకు వీలుగా లేని పరిస్థితి ఉన్న యువతులలో 5.38 రెట్లు అధిక ప్రమాదం ఉందని తేల్చారు. ఇది PCOS సమస్యతో బాధపడుతున్న మహిళల్లో మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచుతుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు. 

19వేల మందిపై స్టడీ

ఈ అధ్యయనం కోసం తైవాన్​లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు 1997 నుంచి 2012 మధ్య కాలంలో PCOSతో బాధపడుతున్న 12 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల దాదాపు 19,000 మంది మహిళలపై ఈ స్టడీ చేశారు. వయస్సు, ఆదాయం, శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. దీనిప్రకారం 40 ఏళ్లలోపు PCOS బాధిత మహిళల్లో ఆత్మహత్య ప్రయత్నాల ప్రమాదం 9.15 రెట్లు ఎక్కువ, వృద్ధుల్లో 3.75 రెట్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వృద్ధులపై PCOS లక్షణాల ప్రభావం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. 

గత అధ్యయనాల ఏమంటున్నాయంటే..

PCOSతో బాధపడుతున్న మహిళలకు డిప్రెషన్, యాంగ్జైటీ, పర్సనాలిటీ డిజార్డర్స్, స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మునుపటి అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. సంతానోత్పత్తికి సంబంధించిన విషయం PCOS ఉన్నవారి మానసిక స్థితిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇవే కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్, హార్మోన్ల ప్రభావాలను నిరోధించే మందులు కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. 

ప్రెగ్నెంట్ కావాలంటే మాత్రం..

అండాశయాలు అదనపు హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు సంభవించే PCOSకి ఎటువంటి నివారణ లేదని నిపుణులు చెప్తున్నారు. అధిక ఇన్సులిన్​ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు చేసి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. కాని ఇది ఏ మాత్రం వారిపై మంచి ప్రభావం చూపించదు. మీరు ప్రెగ్నెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు అండోత్సర్గము చేయించుకోవాల్సి వస్తుంది. 

Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి తగ్గించుకోవచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget