News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, సమతుల్య ఆహారం తీసుకుంటే గుండెని పదిలంగా చూసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

రోజుల్లో ఎప్పుడు ఎవరికి గుండె పోటు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్టు ఉండి గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి రోజూ టీవీ, పేపర్లలో చూస్తూనే ఉంటున్నాం. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఇది. ప్రాణాంతకంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధమనుల్లో ఫలకం పేరుకుపోయి అడ్డంకిగా మారినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఈ ఫలకం పగిలితే రక్తం గడ్డకడుతుంది. దీని కారణంగా రక్తం, ఆక్సిజన్ గుండెకి చేరడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో గుండె కండరాలకు కోలుకోలేని నష్టం జరిగి ప్రాణాంతకం అవుతుంది. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అనారోగ్య జీవనశైలి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా గుండె పోటుకు గురవుతారు.

గుండె పోటు లక్షణాలు

  • ఛాతీ నొప్పి
  • ఛాతీలో బిగుతుగా అనిపించడం
  • అసౌకర్యంగా ఉండటం
  • అలసట
  • చిరు చెమటలు
  • గుండెల్లో మంట
  • వికారం
  • శ్వాస ఆడకపోవడం
  • గుండె కండరాల నొప్పి
  • దవడ లేదా చేయి లేదా పై భాగంలో లాగుతున్నట్టుగా అనిపించడం

అజీర్ణం

లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకుంటే గుండె పోటు నుంచి బయట పడొచ్చని నిపుణులు వెల్లడించారు. గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ముందుగా కొన్ని పరీక్షలు చేస్తారు.

ఈసీజీ(ECG)

గుండెల్లో అసౌకర్యంగా ఉందని హాస్పిటల్ కి వచ్చిన వెంటనే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఇది గుండె నుంచి విద్యుత్ సిగ్నల్స్ ని రికార్డ్ చేస్తుంది. గుండె కొట్టుకునే దాన్ని బట్టి గుండె పోటు వచ్చిందో లేదో గుర్తిస్తుంది. అయితే కొన్ని సార్లు గుండె పోటు అనేది ఈసీజీలో కనిపించదు.

ఎక్స్ రే

ఛాతీ ఎక్స్ రే లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ వంటి ఇమేజింగ్ పరీక్షలు కూడా గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సహాయపడతాయి. గుండెకి జరిగిన నష్టాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది.

రక్తపరీక్ష

గుండె పోటు సంభవించినప్పుడు గుండె నుంచి కండరాల ప్రోటీన్లు దెబ్బతిన్న కండరాల నుంచి రక్తంలోకి విడుదల అవుతాయి. మయోగ్లోబిన్, ట్రోపోనిన్ I, ట్రోపోనిన్ R వంటి గుండె కండరాల ప్రోటీన్లు రక్తంలోకి వస్తాయి. వీటిని గుర్తించేందుకు రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ టెస్ట్ చేస్తారు. ఈ రోగనిర్ధారణ పరీక్షలు గుండె పోటు వచ్చిందో లేదో చెప్పేందుకు సహాయపడతాయి. ఈ ప్రోటీన్లు సాధారణంగా గుండె పోటు వచ్చిన 6 నుంచి 12 గంటల్లోపు పెరుగుతాయి. 48 గంటల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయి. ట్రోపోనిన్ వంటి ప్రోటీన్ల దాడి జరిగిన పది రోజుల తర్వాత కూడా గుర్తించవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: షాకింగ్, ఈ చాక్లెట్‌లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?

Published at : 26 Sep 2023 06:07 PM (IST) Tags: Heart Attack Heart Attack symptoms Blood test World Heart Day Heart Health Heart Attack Problems

ఇవి కూడా చూడండి

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

No sugar Vegetarian meals : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

No sugar Vegetarian meals : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

Anti-Ageing Superfood : నిత్య యవ్వనం కావాలా? ఈ ఆహారాన్ని ఫుడ్‌లో చేర్చండి, ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు!

Anti-Ageing Superfood : నిత్య యవ్వనం కావాలా? ఈ ఆహారాన్ని ఫుడ్‌లో చేర్చండి, ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు!

టాప్ స్టోరీస్

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
×