Healthy Bathing : స్నానం ఎలా చేయాలి, స్త్రీ-పురుషులు పాటించాల్సిన నియమాలేంటి...ఏ సమయంలో స్నానం చేయకూడదు..
మనిషి జీవితంలో స్నానం నిత్య ప్రక్రియ. అయితే ఇదొకపని పూర్తైందిలే అని కాకుండా దీనికో పద్ధతుందని ఎంతమందికి తెలుసు.
వాస్తవానికి స్నానం కనీసం అరగంటైనా చేస్తే మంచిదని చెబుతారు. ముందు నాలుగు చెంబుల నీళ్లతో శరీరం మొత్తం తడిపి సున్నిపిండితో రుద్దుకుని ఆ పై మరో ఏడెనిమిది చెంబుల నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
స్నానంలో రకాలు
ప్రభాతవేళ 4, 5 గంటమధ్య చేసే స్నానం ఋషి స్నానం
ఉదయం 5,6 గంటల మధ్య చేసేది దైవ స్నానం
ఉదయం 6,7 గంటల మధ్య చేసేది మానవ స్నానం
ఆ తరువాత చేసేది రాక్షస స్నానం
'స్త్రీ' ఎలా స్నానం చేయాలి: స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద నూలు పోగు లేకుండా చేయాలి. స్నానం అయిన తరువాత ముందు ముఖాన్నీ ఆ తర్వాత వక్షస్థలాన్ని తుడుచుకున్నాక ఒళ్లంతా తడి ఆరేలా తుడుచుకోవాలి. స్నానం చేసిన వెంటనే చూపుడు వేలుని ఉపయోగించకుండా బొట్టుపెట్టుకోవాలి.
పురుషుడు స్నానం ఎలా చేయాలి:
అన్ని స్నానాల కన్నా సముద్రస్నానం శ్రేష్టం. ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రెండోది నదీ స్నానం. వేకువజామున నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయని చెబుతారు. నదీ జలాలు కొండలు, చెట్లును తాకుడూ ప్రవహిస్తూ ఎన్నో వనమూలికలను తనతో పాటూ తీసుకొస్తుంది. అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి ఉత్తమమైనదని చెబుతారు. ఇక చివరిది ఇంటి స్నానం. అతి వేడి నీటితోగానీ, అతి చల్లటి నీటితోగానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల వున్న అవయవాలకి మంచిదంటారు. అయితే మగవారు మొండి మొలతో స్నానం చేయరాదని శాస్త్రం చెబుతోంది.
ఏ సమయంలో స్నానం చేయాలి: స్నానం చేసే సమయం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటారు. సహజంగా అందరం ఉదయం స్నానం చేస్తుంటాం. అయితే రాత్రుళ్లు కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో రాత్రి పూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రోజంతా రకరాల పనుల్లో ఉండటం వల్ల రాత్రి స్నానం చేస్తే ఒత్తిడి దూరమవుతుందంటారు.
ఏ సమయంలో చేయరాదు: కొంత మంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని సూచిస్తున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు 2 గంటల పాటు స్నానం చేయకూడదు. ఇక నిద్రకు, స్నానానికి మధ్య కాస్త సమయం ఉండేలా చూసుకోవాలంటారు. స్నానం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏంటంటే ఎక్కువ సార్లు స్నానం కూడా అస్సలు మంచిది కాదట.
Also Read: ఈ రాశుల వారికి బాధ్యతలు పెరుగుతాయి, వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..
Also Read: పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..
Also Read: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి