అన్వేషించండి

Health Benefits Of Turmeric : చిటికెడు పసుపులో.. కొండంత లభాలు

Health Benefits Of Turmeric : వంటల్లో వాడే పసుపులోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన వంటింట్లో వాడే పదార్థాల్లో పసుపు.. అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది.

Health Benefits Of Turmeric : పసుపు లేనిదే భారతీయ వంటకాలు పూర్తికావు. వాస్తవానికి పసును రుచి కోసం వాడరు. అందులోని ఔషద గుణాల వల్ల తరతరాలుగా పసుపు వాడకంలో ఉంది. పసుపు ఒక యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుంది. ఇందులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ఇస్తుంది. భారతీయ వంటకాల్లో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది. పసుపు వేస్తే వంటకు రుచివస్తుంది. కర్కుమిన్.. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ మహమ్మారితో కూడా పోరాడే శక్తి పసుపులో ఉంటుంది. పసుపు వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మెటబాలిక్ సిండ్రోమ్‌ను మెరుగుపరుచుతుంది:

మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది హై బ్లడ్ షుగర్, ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు వీటితో పాటు మరిన్ని ప్రమాద కారకాలు కలిగి ఉంటుంది. ఇతర ప్రమాద కారకాలు ఉదర ఊబకాయం, తక్కువ హెచ్ డీఎల్ (మంచి కొవ్వు) కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. ముగ్గురిలో ఒకరికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది. 2016లో ప్రచురించిన ఓ అధ్యయనం మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారిలో కర్కుమిన్‌తో ఉన్న ప్రభావాన్ని పరిశీలించింది. ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌లు లేదా మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం ఉన్న ప్రోటీన్‌లను టెస్టు చేశారు. ఎనిమిది వారాలలో పాల్గొనేవారి రక్త నమూనాలలో కర్కుమిన్ సైటోకిన్‌లను గణనీయంగా తగ్గించిందని అధ్యయనంలో తేలింది. 

డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది:

డిప్రెషన్ అనేది ఒక సాధారణ, తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. విచారం,శరీరం బలహీనంగా ఉండటం,ఆకలి లేకపోవడం ఆనందాన్ని కోల్పోవడం వంటి భావాలను కలిగిస్తుంది. దాదాపు 17శాతం మంది వ్యక్తులు తమ జీవితంలో నిరాశను అనుభవిస్తారు. 20 ఏళ్ల చివరిలో లేదా యుక్త వయస్సులో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్ కు లోనవుతుంటారు. 2020లో ప్రచురించిన ఓ అధ్యయనంలో నిరాశ, ఆందోళనపై పసుపు చూపే ప్రభావాలను పరిశీలించింది. పసుపుతో సప్లిమెంట్ తయారు చేసి ఇచ్చిన వ్యక్తుల్లో ఒత్తిడి, డిప్రెషన్ తగ్గడం గమనించారు.   

వాపును తగ్గిస్తుంది:

పసుపులో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలో వచ్చే వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ జెర్మ్స్‌ను ఎదుర్కొనప్పుడు లేదా గాయమైనప్పుడు  మీ శరీరాన్ని రక్షించేందుకు లేదా గాయాన్ని నయం చేసేందుకు సైటోకిన్ వంటి రసాయనాలను పంపుతుంది. నొప్పి, అలసట, నిరాశ, బరువు పెరగడం, ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. 2015లో ప్రచురించిన ఓ అధ్యయనంలో పసుపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. ఇది నొప్పి, అలసట, నిరాశ, బరువు పెరగడం, ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లక్స్ తదితర సమస్యలకు దారితీస్తుంది. ఆరు వారాలకు పైగా పసుపు సప్లిమెంట్లను మంచి ఫలితాలను పొందవచ్చని తెలిపారు. 

డయాబెటిస్ ను నియంత్రిస్తుంది:

పసుపు తీసుకునేవారిలో డిటాక్సీఫయింగ్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. మరోవైపు క్యాన్సర్ రోగులు కీమోథెరపీ చికిత్స తీసుకున్నప్పుడు వారికి వైద్యులు ఇచ్చే మందులతోనూ పసుపు కలిపి తీసుకుంటే మెరుగ్గా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్యఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వాపులు రాకుండా నిరోధిస్తుంది పసుపు. బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ చాలా వరకు కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. 

క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది:

పసుపు క్యాన్సర్ వంటి మహమ్మారిని సైతం తగ్గిస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నిరోధిస్తుంది. క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు పసుపు కణితి పరిమాణం, బరువును తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్ నొప్పులకు చెక్:

ఆర్థరైటిస్ అనేది కీళ్ల వాపు, మోకాళ్లు లేదా మోచేయి వంటి రెండు ఎముకలు కలిసే చోటు. కీళ్ల నొప్పులు, వాపులు, ద్రుఢత్వం వంటివి కీళ్ల నొప్పుల లక్షణాలు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు సహాయపడుతుంది. పసుపు సైటోకిన్స్ అని పిలువబడే ప్రో-ఇన్‌ఫ్లమేటరీ కణాలను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

Also Read : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలట

 


Health Benefits Of Turmeric : చిటికెడు పసుపులో.. కొండంత లభాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్,
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్, "ఆ నలుగురికి" అన్యాయం జరిగిందా ?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
Kalki 2898 AD Japan Release Date : జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP DesamVikarabad Collector Prateek Jain Attacked | కలెక్టర్‌పై గ్రామస్థుల మూకుమ్మడి దాడి | ABP DesamGautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్,
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్, "ఆ నలుగురికి" అన్యాయం జరిగిందా ?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
Kalki 2898 AD Japan Release Date : జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Crime News: 10 వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడి మృతి - గుండె పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు
10 వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడి మృతి - గుండె పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు
Matka Censor Review - 'మట్కా' సెన్సార్ రివ్యూ: క్లైమాక్స్ యాక్షన్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ - రన్ టైమ్ ఎంత? ఇంకా సినిమా టాక్!
'మట్కా' సెన్సార్ రివ్యూ: క్లైమాక్స్ యాక్షన్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ - రన్ టైమ్ ఎంత? ఇంకా సినిమా టాక్!
Congress News: సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసిన ఎమ్మెల్యే, ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి
సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసిన ఎమ్మెల్యే, ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి
Krish Jagarlamudi Wedding Photo: మళ్ళీ క్రిష్ జాగర్లమూడి పెళ్లి - భార్య ప్రీతి చల్లాతో ఫస్ట్ ఫోటో చూశారా?
మళ్ళీ క్రిష్ జాగర్లమూడి పెళ్లి - భార్య ప్రీతి చల్లాతో ఫస్ట్ ఫోటో చూశారా?
Embed widget