వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే కఫానికి చెక్ పెట్టండిలా నీళ్లు, హెర్బల్ టీలు, వెచ్చని సూప్స్ తాగుతూ హైడ్రెట్ గా ఉండాలి. వేడికి సన్నని శ్లేషం నయం అవుతుంది. కఫాన్ని వదులుకునేందుకు, రద్దీని తగ్గించేందుకు వేడినీటితో ఆవిరి పీల్చుకోండి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్లేష్మ ఉత్పత్తి, శ్వాసకోశ లక్షణాలను తీవ్రం చేసే సిగరెట్, ఘాటు వాసనలకు దూరంగా ఉండండి. దగ్గు, కఫం ఇబ్బంది పెడుతుంటే వైద్యుని సలహా మేరకు సిరప్ వాడండి. కఫం ఇబ్బంది పెడుతుంటే చల్లగాలికి తిరగకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చూసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కఫాన్ని తగ్గించేందుకు సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నించాలి. పై చిట్కాలు పాటించినా కఫం తగ్గనట్లయితే..తదుపరి చికిత్స కోసం మీ వైద్యుడి సలహా తీసుకోండి.