ఆఫీసులో తీరికలేకుండా పని? ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ కుర్చీలో నుంచి లేచి నడవడానికి మీ ఫోన్ లో రిమైండర్ సెట్ చేసుకోండి. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రత తగ్గుతుంది. రోజంతా పుష్కలంగా నీళ్లు తాగాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన స్నాక్స్ కు బదులు పండ్లు, గింజలు, పెరుగు లేదా మిల్లేట్స్ వంటి తీసుకోండి. ఇవి ఎనర్జీ లెవల్స్ ను మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. భోజనం సమయంలో అతిగా తినకూడదు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు శ్వాసవ్యాయామాలు, ధ్యానం చేయండి. కంటిన్యూగా కూర్చోకుండా ప్రతి గంటకోసారి బ్రేక్ తీసుకోండి. ఇది కండరాల ఒత్తిడి, కంటి ఒత్తిడి, మానసిక అలసటను దూరం చేస్తుంది. మీ సహెద్యోగులతో కాసేపు ముచ్చటించండి. ఇది మీ పని ఒత్తిడి తగ్గిస్తుంది.