జొన్నరొట్టెలు తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు డయాబెటిస్‌కు కారణం అవుతున్నాయి. డయాబెటిస్ సోకిన రోగులు ఆహారంలో మార్పులు చేసినట్లయితే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. జొన్నరొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఎముకలను బలంగా ఉంచుతాయి. జొన్నలలో ప్రొటీన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఫైబర్, యాంటీ కాన్సర్ ప్రాపర్టీస్ వంటివి ఉన్నాయి. షుగర్ తో బాధపడుతున్నవారు ఈ జొన్నరొట్టెలు తింటే ఎంతో మేలు జరుగుతుంది. జొన్నరొట్టెలు మాత్రమే కాదు జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు కూడా తినవచ్చు. జొన్నలతో తయారు చేసిన జావా, జొన్న పిండితో మురుగులు చేసుకోవచ్చు. సులభంగా జీర్ణం అవుతాయి. వేడి వేడి జొన్న రొట్టెను ఉల్లిపాయ, కారం, కాస్త నూనెల కలుపుకుని తింటే టేస్టు భలే ఉంటుంది.