Image Source: Pexels

బెల్లం ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా?

బెల్లం చెరుకు నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఐరన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బెల్లం తినడానికి సరైన సమయం ఏదో చూద్దాం.

భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకుంటే జీర్ణ ఎంజైమ్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి.

వేడిని ఉత్పత్తి చేసే సహజ గుణం బెల్లంలో ఉంది. శీతాకాలంలో బెల్లం తింటే వెంటనే శక్తి అందిస్తుంది. శరీరం వేడిగా ఉంటుంది.

వ్యాయామానికి ముందు కొద్దిగా బెల్లం తింటే తక్షణ శక్తి వస్తుంది. వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుంది.

సాయంత్రం కొంచెం బెల్లం తింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు లేదా బెల్లం తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image Source: pexels

మలబద్ధకాన్ని నివారించి ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.