Image Source: pexels

ఉడికించిన ఆహారం vs ఉడికించని ఆహారం - వీటిలో ఏది బెస్ట్?

పచ్చికూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వండే సమయంలో తగ్గుతాయి.

విటమిన్ సితోపాటు కొన్ని విటమిన్లు వేడికి సున్నితంగా ఉంటాయి. ఆహారాన్ని వండినప్పుడు ఇవి కోల్పోతాయి.

పచ్చి ఆహారంలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్ సులభంగా ప్రాసెస్ చేయవచ్చు.

పండ్లు, కూరగాయల్లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హైడ్రేషన్‌కు సహాయపడుతుంది.

ఉడికించినప్పుడు వాటిలో ఉన్న కొన్ని పోషకాల లభ్యత పెరుగుతుంది.

టమోటోలను ఉడికించడం వల్ల లైకోపిన్ పెరుగుతుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా పెరుగుతాయి.

ఉడికించడం వల్ల గట్టి ఫైబర్స్, ప్రొటీన్లు విచ్ఛినమవుతాయి. ఆహారాన్ని నమలడం, జీర్ణం కావడం సులభం అవుతుంది.

పచ్చికూరగాయలు ప్లాన్ ప్రకారం తీసుకోకుండా పోషక లోపానికి దారిస్తుంది. కొన్ని పోషకాలను ముడి పదార్థాల నుంచి పొందడం కష్టం.

Image Source: pexels

ఆహారాన్ని ఎక్కువగా ఉడికిస్తే పిండి పదార్థాల్లో అక్రిలమైడ్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి.