Image Source: pexels

ఈ ఫుడ్స్ తింటే ఎనర్జీ సర్రున వస్తుంది

అరటిపండ్లలో సహజ చక్కెరలు పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది.

ఓట్స్ లో కార్బొహైడ్రేట్లు, ఫైబర్ శక్తిని పెంచుతుంది. జీవక్రియకు అవసరమైన విటమిన్లను కలిగి ఉంటుంది.

పెరుగులో లాక్టోస్, ప్రోటీన్లు తిన్నవెంటనే శక్తిని అందిస్తాయి.ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి.

బాదం, వాల్నట్స్, జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

గుడ్లలలో ప్రొటీన్ ఉంటుంది. కండరాల కణజాలాన్ని నిర్మించడంలో సహాయపడే అమైనో ఆమ్లాలు ఉంటాయి.

బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ రవాణా కీలకమైంది. శక్తిని పెంచుతుంది.

చిలకడదుంపలలో కార్బొహైడ్రెట్స్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి శక్తిని అందిస్తాయి.

యాపిల్స్ లో సహజచక్కెరలు, ఫైబర్ ఉంటుంది. వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది.

డార్క్ చాక్లెట్ లో కెఫిన్, థియోబ్రోమిన్ శక్తిని పెంచుతాయి.

Image Source: pexels

చియా విత్తనాలలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.