మీ ఇంట్లోకి దోమలు రాకూడదంటే.. వెంటనే ఇలా చెయ్యండి దేశంలో అనేక ప్రాంతాల్లో డెంగ్యూ ఫీవర్ పెరుగుతోంది. మీ ప్రాంతంలో కూడా దోమల సమస్య ఉంటే ఈ టిప్స్ పాలో అవ్వండి. మీ ఇంటి చుట్టూ నీటి నిల్వలు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. నీరు నిల్వ ఉంటే దోమలు ఎక్కువగా ఉంటాయి. టబ్బులు, బకెట్లలో నీరు నిల్వ చేయకూడదు. తాగిపడేసిన కొబ్బరి బొండాలు, టైర్లు వంటివి ఉంటే తీసిపారేయండి. ముఖ్యంగా వర్షాకాలంలో మీ ఇంటి చుట్టూ ఉన్న కాలువలను శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోండి. మీ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉంటే దోమల నివారణ మందులను వాడండి. బంతి, లెమన్ గ్రాస్, తులసి వంటి మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు రావు. కర్పూరాన్ని వెలిగించి ఇంటి తలుపులు మూయాలి. అరగంట తర్వాత ఇంట్లోని దోమలన్నీ వెళ్లిపోతాయి. నీటిలో తరిగిన వెల్లుల్లి రెబ్బలను ఉడకబెట్టాలి. స్ప్రే బాటిల్లో నింపి ఇంట్లో పిచికారి చేయాలి.