Haldi water: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
పసుపు పొడి తెలుగిళ్లల్లో కామన్ గా ఉండేదే. దాంతో చేసుకుని తాగే డ్రింకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి.
ప్రాచీనకాలం నుంచి పసుపు మన వంటింట్లో భాగమైపోయింది. ప్రతి కూరలో పసుపు పడనిదే నోరూరించే రంగు రాదు. పసుపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే చాలా మందికి తెలుసు. కానీ రోజూ కాఫీ, టీ తాగినట్టే పరగడుపున పసుపు నీళ్లు తాగితే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. మొండి వ్యాధులు దరిచేరవు. శరీరంలో మలిన రహితంగా మారుతుంది. పసుపు నీళ్లను చేసుకునే విధానం కూడా చాలా సులువే. ముందుగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
1. కీళ్ల నొప్పులు మాయం
ఎక్కువ మందిని ఇప్పుడు వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. ముఖ్యంగా మహిళల్లోనే ఇది ఎక్కువ. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి ఆర్ధరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నొప్పితో బాధపడేవాళ్లు రోజూ గ్లాసు పసుపు నీళ్లు తాగితే కొన్నాళ్లు కీళ్లనొప్పులు తగ్గుతాయి.
2. రోగనిరోధక శక్తి
పసుపులో ఉండే కర్కుమిన్ రోగినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు శరీరఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.
3. బరువు తగ్గేందుకు...
బరువు తగ్గాలనుకునేవారికి కూడా పసుపు నీళ్లు మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం బరువు తగ్గడానికి అవసరమైన ముఖ్యవిషయం. పసుపు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నీటితో కలిపి పసుపు తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
4. చర్మం మెరుపుకు
పసుపులో యాంటీ ఆక్సడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. పసుపు నీళ్లు తాగడం వల్ల ఫ్రీరాడికల్స్ చేసే డ్యామేజ్ ని అడ్డుకుని ఏజింగ్ లక్షణాలు కనిపించకుండా చేస్తాయి. క్రమం తప్పకుండా రోజూ పసుపునీళ్లు తాగితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
5. మలినాలను తొలగిస్తుంది (డిటాక్సిఫికెషన్)
శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటికి పంపించడమే డిటాక్సిఫికేషన్ అంటే. మనం తినే ఆహారం, పీల్చే గాలి, పర్యావరణం ద్వారా రకరకాల మలినాలు మన శరీరంలో చేరుతాయి. వాటి వల్ల అనారోగ్యాలు కలుగుతాయి. వాటిని తొలగించేందుకు పసుపు నీళ్లు తాగడం సరైన పద్ధతి.
పసుపు నీళ్లు తయారు చేసే పద్ధతి...
గ్లాసుడు నీళ్లను వేడి చేయాలి. అందులో రెండు చిటికెళ్ల పసుపు వేసి బాగా కలపాలి. అలా రెండు నిమిషాల మరిగించాలి. తరువాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. మీకు కావాలనుకుంటే తేనెను కూడా చేర్చుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి