అన్వేషించండి

Copper Bottles: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఈ సమస్యలు అధిగమించవచ్చు

రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

ఒకప్పుడు రాగి, ఇత్తడి పాత్రల వాడకమే జరిగేది. నీటిని తాగడానికి రాగి పాత్రలే ఉపయోగించే వాళ్ళు. అందులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అది నిజం కూడా. నీటిని శుభ్రం చెయ్యడానికి అప్పట్లో ఉన్న ఏకైక మార్గం రాగి పాత్రల్లో నీటిని నిల్వ చెయ్యడమే. కానీ ఇప్పుడు వాటి వినియోగం తగ్గిపోయింది. వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్స్ వచ్చిన తర్వాత వాటి వినియోగం తగ్గిపోయింది. మినరల్ వాటర్ తాగడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ రాగి పాత్రల్లో నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తహీనత, మూత్రపిండాల సమస్యలు ఏవి రావని వైద్యులు చెప్తున్నారు.

నీరు జీవనాధారం. నీళ్ళు తాగడకుండా జీవించడం అసాధ్యం. అందుకే స్వచ్చమైన నీటిని తాగడం చాలా అవసరం. నీరు శరీరానికి మరింత శక్తిని ఇస్తుంది. రాగి పాత్రల్లో సుమారు 6 నుంచి 8 గంటల పాటు నీటిని నిల్వ చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా నశించిపోతుంది. అప్పుడు అవి ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన నీళ్లుగా మారతాయి. వాటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు పెట్టుకుని తాగుతూ ఉంటారు. దానికి బదులుగా రాగి బాటిల్ వాడితే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాగి బాటిల్ లో నీళ్ళు తాగడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.     

రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు

❄ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో రాగి నీళ్లు సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా ముఖ్యం.  సాధారణ ప్యూరిఫైయర్ నీటికి బదులుగా రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగాలి. ఇది ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా జీర్ణం చెయ్యడంలో సహకరిస్తుంది.

❄ కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది.

❄ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

❄ రక్తపోటుని నియంత్రిస్తుంది.

❄ రాగి పాత్రలో 6 నుంచి 7 గంటల పాటు నీరు నిల్వ చేయడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా నశించిపోతుంది. కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపులో ఉన్న ఇబ్బంది తొలగించేందుకు సహకరిస్తుంది. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది.

❄ కిడ్నీకి సంబంధించిన వ్యాధులను అధిగమించేందుకు రాగి బాటిల్ లో నీళ్ళు తాగడం ఉత్తమం.

❄ ఆహార మార్పుల కారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇది ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. వాటి నుంచి రక్షణ పొందాలంటే రాగి పాత్రల్లో నీటిని తాగాలి.

❄ రాగి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రాగి బాటిల్స్ లో నీళ్ళు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

❄ రాగి మన శరీరానికి చాలా అవసరం. అందుకే మనం తాగే నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేయడం రాగి బాటిల్స్తో తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీళ్ళు శరీరంలోని అదనపు కొవ్వు తగ్గించి బలహీనత రాకుండా నివారిస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంతమంది రాగి పాత్రల్లో వంట చేయడం వాటిని వినియోగించడం చేస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: జుట్టు రాలడానికి కారణాలివే, ఇలా చేస్తే బట్టతల రానేరాదు

Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget