News
News
X

Hair Care: జుట్టు రాలడానికి కారణాలివే, ఇలా చేస్తే బట్టతల రానేరాదు

స్త్రీ, పురుషులు అని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేది జుట్టు రాలడం బట్ట తల సమస్యే.

FOLLOW US: 

జుట్టు రాలడం అనేది స్త్రీలనే కాదు, పురుషుల్లోనూ పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆడవాళ్ళకి కాస్త కాకపోతే కాస్తయినా జడ ఉంటుంది. పురుషుల్లో అయితే జుట్టు ఉండేదే కొంచెం అది కూడా ఊడిపోయిందంటే ఇక బట్టతలే గతి. దాని వల్ల నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోతుంది కదా అని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ మార్కెట్లో దొరికే వాటిని వాడేస్తూ కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనం మాట అటుంచితే ఉన్నది కూడా రాలిపోవడం జరుగుతుంది. అసలు జుట్టు రాలిపోవడానికి కారణాలు ఏంటో ఖచ్చితంగా గుర్తించగలగాలి. అప్పుడే ఆ సమస్య నుంచి బయట పడేందుకు మార్గాలు వెతుక్కోవచ్చు.

జుట్టు రాలేందుకు ప్రధాన కారణాలు

ఒత్తిడి: శరీరంలో సగం సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడే. ఇది శరీరంలోని పోషకాల అసమతుల్యతకు దారితీస్తుంది. శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది.

విటమిన్ డి లోపం: హెయిర్ ఫోలికల్ శరీరం లోపల నుండి పోషణను పొందుతుంది. ఆరోగ్యకరమైన లేదా అనారోగ్యకరమైన జుట్టును అందించడంలో ఇది చాలా ముఖ్యమైనది. బయోటిన్, జింక్, విటమిన్ డి లోపించడం వల్ల  జుట్టు పల్చబడి రాలిపోతుంది.

బరువు తగ్గడం: అకస్మాత్తుగా చాలా బరువు తగ్గినప్పుడు కొన్ని ముఖ్యమైన పోషకాలను కోల్పోవడం జరుగుతుంది.  ఇది కూడా జుట్టు రాలడానికి దారితీసే లోపాలను అభివృద్ధి చేస్తుంది.

వయస్సు: వయస్సు పెరిగేకొద్దీ జుట్టు సన్నబడి రంగు మారిపోతూ ఊడిపోతుంది. ఇది లింగంతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.

ఇవే కాదు జుట్టుకి సరిగా ఫైబర్ అందని సమయాలో కూడా అది రాలిపోతుంది. జుట్టు రాలిపోయినప్పుడు ఫోలికల్ ఖాళీగా ఉంటే అది చనిపోతుంది. ఫోలికల్ చనిపోతే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదు. దాని వల్లే బట్టతల వస్తుంది. అటువంటి సమయంలో దాని ప్లేస్ లో కొత్తగా జుట్టు రాదు.

జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జుట్టు రాలడాన్ని నివారించడానికి ముందుగా చెయ్యాల్సింది ఒత్తిడి తగ్గించుకోవడం. జుట్టు, చర్మ సమస్యలకి ఇది అతిపెద్ద సమస్య. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇవే కాదు జుట్టుకి పోషణ అందించే విధంగా మంచి ప్రొడక్ట్స్ వినియోగించాలి. వాటిని ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ వహించాలి. హెయిర్ సీరమ్ లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సీరమ్‌లను ఉదయం, సాయంత్రం జుట్టుకి బాగా రాయాలి. ఫోలికల్ ఆరోగ్యాన్ని పెంచడానికి సీరమ్‌లు గొప్ప మార్గం.

సప్లిమెంట్స్: కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడమే కాదు అవసరం అయితే కావాల్సిన సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. మల్టీ విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3, 6, కొవ్వు ఆమ్లాలు, బయోటిన్ మొదలైన సప్లిమెంట్లను ఎంచుకోవచ్చు.  

ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత జుట్టు రాలడం పెద్ద సమస్యగా కనిపించడం లేదు. సులభమైన ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్ ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయట పడుతున్నారు. ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స లేదా మెసోథెరపీ ద్వారా జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచవచ్చు. ఈ రెండు హెయిర్ ఫోలికల్ డిగ్రేడేషన్‌ను తిప్పికొట్టడంలో అద్భుతంగా పని చేస్తున్నాయి. ఫినాస్టరైడ్ (ప్రోపెసియా) అనే మరో చికిత్స కూడా ఉంది. ఇది పురుషులకు సరిపోయే విధానం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!

Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు

Published at : 13 Sep 2022 04:34 PM (IST) Tags: Hair Fall Beauty tips Hair Growth Hair Care Tips Hair Fall Reasons Hari Fall Remedies

సంబంధిత కథనాలు

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే  ఆ నష్టం తప్పదు

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?