Weird: పెళ్లిరోజే వరుడు ఆసుపత్రి పాలు, కానీ పెళ్లి మాత్రం జరిగింది... వరుడి సలహాతోనే వధువు ఇలా చేసింది
పెళ్లంటే ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయే రోజు. కానీ సరిగ్గా పెళ్లిరోజే ఓ వరుడు ఆసుపత్రి పాలయ్యాడు. పెళ్లి మాత్రం ఆగనివ్వకుండా అయ్యేలా చేశాడు.
ఇద్దరు ప్రేమికులు తమ పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. బంధువులు, పెళ్లి వేదిక అన్నీ సిద్ధమైపోయాయి. సరిగ్గా అదే రోజు వరుడు అనారోగ్యం పాలయ్యాడు. కానీ పెళ్లి ఆగడం అతడికి ఇష్టం లేదు. వధువును పిలిచి పెళ్లి ఎలా జరిపించాలో చెప్పి తాను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వధువు వరుడు చెప్పినట్టే అతడిని పెళ్లి చేసుకుని తంతు ముగించింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది. ఇప్పుడు వారి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ పెళ్లి ఫోటోలో వధువు సాధారణంగానే ఉన్నా, పెళ్లికొడుకు మాత్రం పొలల్లో పెట్టే దిష్టిబొమ్మలా ఉన్నాడు. ఓ కర్రకి వరుడి బ్లేజర్ తొడిగి, ముఖం స్థానంలో ట్యాబ్లెట్ ను అమర్చారు. ఆ ట్యాబ్లెట్ పై వరుడి ఫోటోను పెట్టారు.వధువు అతని బొమ్మతోనే కలిసి కేక్ కట్ చేసింది.
ఆ వధూవరుల పేర్లు తెలియలేదు కానీ వారి కథ మాత్రం అమెరికాలో వైరల్ గా మారింది. టిక్ టాక్ వీరిద్దరి పెళ్లి ఫోటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. వారిద్దరూ గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లితో ఒక్కటవుదామనుకున్న వారి కలలకి కరోనా రెండు సార్లు దెబ్బకొట్టింది. మూడోసారి కూడా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడంతో వరుడు చాలా బాధపడ్డాడు. పెళ్లి ఆగకూడదనే ఉద్దేశంతోనే ఇలా పెళ్లి తంతును ముగించినట్టు చెప్పాడు. తాను చెప్పినట్టు ఏర్పాట్లు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆసుపత్రి త్వరగా ఇంటికి చేరి, తన భార్య, ఆమె కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
నెటిజన్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. కొందరు ఆశీర్వదిస్తే, మరికొందరు మాత్రం ఆమె ఐపాడ్ ను పెళ్లి చేసుకుందా అని కామెంట్ చేశారు. మరికొందరు పెళ్లి కోసం చేసిన ఖర్చు వేస్టవ్వకూడదని ఇలా చేశారు అంటూ విమర్శించారు. ఏది ఏమైనా రెండు సార్లు వాయిదా పడిన పెళ్లిని, మూడోసారి వాయిదా పడకుండా చేసుకున్నాడు వరుడు.
Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Read Also: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Read Also: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి