News
News
X

Pulao Recipe: పచ్చిమిర్చి పులావ్, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు

పులావ్ అంటే ఇష్టపడే వారికి పచ్చిమిర్చి పులావ్ తెగ నచ్చేస్తుంది.

FOLLOW US: 
 
పులావ్ అంటే పడే చచ్చేవాళ్లు ఎంతో మంది. అలాంటి వారికి ఈ పచ్చిమిర్చి పులావ్ తెగ నచ్చేస్తుంది. స్పైసీగా నోరూరించేలా ఉంటుంది. దీనికి జతగా పనీర్ కర్రీ, లేదా చికెన్ కర్రీ తింటే ఆ రుచే వారు. దీన్ని పెరుగు చట్నీతో ఉత్తినే తిన్నా టేస్టు అదిరిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకూ నచ్చడం ఖాయం. చేయడం కూడా చాలా సింపుల్.

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - ముప్పావు కిలో
పచ్చిమిర్చి - ఎనిమిది
ఉల్లిపాయలు - రెండు
కొత్తిమీర తరుగు - అరకప్పు
పుదీనా తరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు
గరం మసాలా పొడి - అర స్పూను
నూనె - అవసరమైనంత
యాలకులు - రెండు
లవంగాలు - అయిదు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గ్రీన్ పీస్ - అర కప్పు
క్యారెట్ ముక్కలు - పావు కప్పు

తయారీ ఇలా
1. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ చేసే మందపాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయాలి. 
3. నూనె వేడెక్కాక ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి వేయాలి.  తరువాత క్యారెట్, పచ్చి బఠాణీలను కలపాలి.
4. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ రంగులోకి మారాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి కలుపుకోవాలి. 
5. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు కూడా వేసి కలపాలి. 
6. గరం మసాలా పొడి కూడా వేసి కలపాలి. 
7. ఇప్పుడు అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు వేయాలి. 
8. తరువాత బాస్మతి బియ్యం కూడా కడిగి అందులో వేయాలి. 
9. మూత పెట్టేసి, అన్నం ఉడికాక ఆపేయాలి. 
10. అంతే పచ్చిమిర్చి పులావ్ రెడీ అయినట్టే. 

పచ్చిమిర్చి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కారానికి బదులు పచ్చిమిర్చి వాడడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో క్యాప్సైకిన్ అనే రసాయనం ఉంది. ఇది స్పైసీ రుచిని ఇవ్వడమే కాదు, ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి ఉంటుంది. చాలా మంది పచ్చి మిర్చి తీసి పక్కన పెడతారు. కానీ దాన్ని కూడా కలిపి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చిమిర్చి ముక్కలుగా కాకుండా మెత్తగా రుబ్బి కూరల్లో వేసుకుంటే బయట తీసి పడేయకుండా తినేస్తాము. దీని వల్ల జీర్ణశక్తి మెరగవుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్ పొటాషియం అధికంగా ఉంటాయి. పచ్చిమిరపకాయ తినడం వల్ల వల్ల శరీరంలోని చెడు బ్యాక్టిరియా నాశనం అవుతుంది.  ఎండుమిర్చి కన్నా కూడా పచ్చిమిర్చిని వాడడం వల్లే ఎక్కువ లాభాలు.

News Reels

Also read: పుట్టగొడుగులు శాకాహారమా లేక మాంసాహారమా? శాకాహారులు వాటిని ఎందుకు తినరు?

Also read: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారంటే

Published at : 26 Oct 2022 08:23 PM (IST) Tags: Telugu Recipes Telugu Vantalu Green mirchi Pulao Green Mirchi Recipes Spicy Recipes

సంబంధిత కథనాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

Headache: తలనొప్పిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవి, తింటే నొప్పి పెరిగిపోతుంది

Headache: తలనొప్పిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవి, తింటే నొప్పి పెరిగిపోతుంది

Curd: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?

Curd: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?