Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త
బ్రెయిన్ ట్యూమర్ కేసులు గురించి చాలా తక్కువగా వింటుంటాం. కానీ ఈ వ్యాధి వస్తే మాత్రం రోగి బతకడం అసాధ్యం.
మెదడులో అసాధారణంగా పెరిగే కణితి గ్లియోబ్లాస్టోమా. ఇది మెదడు కణజాలంపై దాడి చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ దీనికి గ్రేడ్ 4 ఇచ్చింది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధికి ఇచ్చే గ్రేడ్. ఒత్తిడి వంటి మానసిక సమస్యలను, ఆందోళన, నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధి మెదడులో ఎక్కువగా సెరిబ్రల్ హెమిస్పియర్స్ లో ఏర్పడుతుంది. మెదడు ఫ్రంటల్, టెంపోరల్ లోబ్స్ లో ఏర్పడి మెదడుని నాశనం చేస్తుంది. సరైన కాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే రోగి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో చనిపోతారు. ఈ ట్యూమర్ కాలపరిమితి 15 నెలలు మాత్రమే.
ఈ వ్యాధి, దాని చికిత్స రెండూ మెదడు పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. రోగులు న్యూరోలాజికల్, కాగ్నిటివ్, సైకియాట్రిక్ లక్షణాలను అనుభవిస్తారు. అది వారి దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ ప్రకారం గ్లియోబ్లాస్టోమా అనేది అత్యంత సాధారణ ప్రాణాంతక మెదడు కణితి.
బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లు డిప్రెషన్ కి ఎందుకు గురవుతారు?
గ్లియోబ్లాస్టోమా ఉన్న రోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తారు. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వారి ఆలోచన శక్తి మందగించేలా చేస్తుంది. ఒక్కోసారి బాధ భరించలేక ఆత్మహత్యకి ప్రేరేపించేలా చేస్తుంది. రోగులు ఎందుకు డిప్రెషన్ కి గురవుతారో తెలుసుకోవడం కోసం కొన్ని పరిశోధనలు జరిగాయి. అధ్యయనాల ప్రకారం ట్యూమర్ స్థానం, రకం అనేవి ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు కణితి కోసం శస్త్ర చికిత్స చేసిన తర్వాత కూడా డిప్రెషన్ లోనే ఉంటారు. ఇది కణితిని దాచేస్తుంది. ఫ్రంటల్ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల్లో డిప్రెషన్ ఒకటి.
గ్లియోబ్లాస్టోమా లక్షణాలు, సంకేతాలు
కణితి పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు మెదడులోని భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ కణితి చాలా పెద్దది కాకపోతే ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ చిన్నదిగా ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి.
⦿ దీర్ఘకాలిక తలనొప్పి
⦿ వికారం, వాంతులు
⦿ విపరీతంగా నిద్రపోవడం
⦿ శరీరం ఒక వైపు బలహీనంగా అనిపించడం
⦿ జ్ఞాపకశక్తి కోల్పోవడం
⦿ మాట్లాడటంలో సమస్యలు
⦿ మానసిక కల్లోలం
⦿ కండరాల బలహీనత
⦿ అస్పష్టమైన దృష్టి
⦿ ఆకలి లేకపోవడం
⦿ మూర్చలు
⦿ ఒత్తిడి ఆందోళన
⦿ ఆత్మహత్య ఆలోచనలు
చికిత్స
ఈ వ్యాధికి ప్రధానమైనది శస్త్రచికిత్స అని వైద్యులు చెబుతున్నారు. రేడియేషన్, కీమోథెరపీ కూడా చేస్తారు. మెదడు కణజాలాన్ని గాయపరచకుండా వీలైనంత వరకు ఎక్కువ కణితిని తొలగించడం శస్త్రచికిత్స ప్రాథమిక లక్షణం. అలాగే చాలా మంది రొగులు డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి లక్షణాలను అధిగమించడం కోసం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని తీసుకుంటారు. ఈ వ్యాధి చివరి దశకు చేరుకుంటే మాత్రం ప్రాణాలు కాపాడటం కష్టం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?