అన్వేషించండి

Garlic Water Benefits : బ్లడ్​లో షుగర్​ ఎక్కువగా ఉందా? ఈ డ్రింక్​ తాగితే మధుమేహంతో పాటు మరెన్నో కంట్రోల్ అవుతాయట

Garlic Benefits : వెల్లుల్లి నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆ సమస్యలున్నవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. 

Garlic Water Benefits for Health : వెల్లుల్లి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. వివిధ వంటలతో కాకుండా.. నేరుగా, సలాడ్స్​లలో కూడా దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిని నేరుగా తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలా అని దీనికి దూరంగా ఉంటే ఎన్నో హెల్త్​ బెనిఫిట్స్​ని మీరు కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనితో చేసిన నీటిని తీసుకుంటే హెల్త్​కి మంచిదని చెప్తున్నారు. ఇంతకీ వెల్లుల్లి వాటర్ బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

వెల్లుల్లి దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దీనిని ఔషదంగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇది వంటలకు మంచి రుచిని అందిస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్స్, సాస్​, నాన్​వెజ్, సూప్స్​ వంటివాటిలో వీటిని ఉపయోగిస్తారు. ఇది అనేక అంటువ్యాధులు, వ్యాధుల చికిత్సకు సహజ నివారణగా పనిచేస్తుంది. అయితే దీనిని గార్లిక్​ వాటర్​గా కూడా మీరు తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చట. 

ఎలా తయారు చేయాలంటే..

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి..  ఆ పేస్ట్​ని నీటిలో కలపాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి బయోయాక్టివ్ సమ్మేళనాలను ఆ నీటిలోకి విడుదల చేస్తుంది. వెల్లుల్లి అల్లిసిన్ ఉంటుంది. ఇది సల్ఫర్ కలిగిన సమ్మేళనం. ఇది ఇన్​ఫ్లమేటరీ ప్రోటీన్లను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని రాత్రుళ్లు తీసుకుంటే నిద్ర నాణ్యత పెరుగుతుంది. అల్లిసిన్ శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది. దీనిలో మీరు మిరియాల పొడి వేసుకుని తాగవచ్చు. ఇది వెల్లుల్లి రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.

వెల్లుల్లినీటితో కలిగే ప్రయోజనాలు ఇవే.. 

వెల్లుల్లిలోని అల్లిసిన్ సెల్యులార్ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. కడుపు క్యాన్సర్, కొలొరెక్టల్ వంటి నిర్దిష్ట రకాల క్యాన్సర్లను నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. 

షుగర్ కంట్రోల్ అవుతుంది..

వెల్లుల్లి వాటర్​ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అధిక రక్త చక్కెర సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితముంటుంది. వీటిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు వైరస్​లను శరీరంలోనికి చేరనీయకుండా అడ్డుకుంటాయి. 

జీర్ణ సమస్యలు దూరం

వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలను ఈ డ్రింక్ దూరం చేస్తుంది. ఉబ్బసం, బ్రౌన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. ఇన్​ఫెక్షన్లను నిరోధించి.. శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. అయితే దీనిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. 

Also Read : లంచ్ బాక్స్ స్పెషల్ టేస్టీ దాల్ పులావ్.. చాలా సులభంగా ఇంట్లో చేసేసుకోండిలా

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget