అన్వేషించండి

Dal Pulao Recipe : లంచ్ బాక్స్ స్పెషల్ టేస్టీ దాల్ పులావ్.. చాలా సులభంగా ఇంట్లో చేసేసుకోండిలా

Easy Indian Recipes : సులువుగా లంచ్ బాక్స్​ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు దాల్ పులావ్​ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని టేస్టీగా ఎలా చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Vegetarian Pulao Recipes : పులావ్​ అంటే ఇష్టమా? అయితే శ్రావణమాసంలో చక్కగా దాల్ పులావ్ చేసేసుకోండి. దీనిని బ్యాచిలర్స్​ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనిని సులభంగా చేయడమే కాకుండా రుచిలో కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడి తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

నూనె - 2 టీస్పూన్స్

నెయ్యి - 2 టీస్పూన్స్

దాల్చిన చెక్క - 1 అంగుళం

లవంగాలు - 4

యాలకులు - 4

షాజీరా - అర టీస్పూన్

స్టార్ పువ్వు - 1 

బిర్యానీ ఆకు - 1

మరాఠి మొగ్గ - 1

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 6

పుదీనా - పావు కప్పు

బఠానీ - పావు కప్పు

టమాటా - 1

క్యారెట్ - 1

బంగాళ దుంప - 1

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

పెసరపప్పు - అరకప్పు

పెరుగు - పావు కప్పు

బియ్యం - ఒక కప్పు

ఉప్పు - రుచికి తగినంత

కొత్తిమీర - గార్నిష్​కి తగినంత 

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును పది నిమిషాలు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా కడిగి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కోసుకోవాలి. టమోటాలు, క్యారెట్, బంగాళదుంపలను ముక్కలుగా కోసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. 

నూనె వేడి అయిన తర్వాత దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠి మొగ్గ వేసుకోవాలి. అవి కాస్త వేగి.. మంచి వాసన వస్తున్నప్పుడు దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. బఠానీలు వేసి.. కాసేపు ఉడికించుకోవాలి. అనంతరం టమోటా, క్యారెట్, బంగాళ దుంపలు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. వాటిని బాగా కలిపి మగ్గించుకోవాలి. 

Also Read : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే

ముక్కలు కాస్త ఉడికిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అనంతరం పెసరపప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. బియ్యం వేసి మరోసారి కలపాలి. పెసరపప్పు అరకప్పు తీసుకుంటే బియ్యం కప్పు తీసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే నీరు రెండు కప్పులు తీసుకోవాలి. నీరు వేసి.. ఉప్పు వేసి కలిపి.. కొత్తమీర వేసి మూతపెట్టాలి. 

నీరు పూర్తిగా ఇంకిపోయి.. రైస్ ఉడికిపోతుంది. అంతే వేడి వేడి టేస్టీ దాల్ పులావ్ రెడీ. దీనిని తయారు చేయడం చాలా తేలిక కాబట్టి ఉదయాన్నే లంచ్​ బాక్స్​ కోసం సిద్ధం చేసుకోవచ్చు. దీనిలో కర్రీ వేసుకోకపోయినా తినొచ్చు. ఆవకాయతో కూడా దీనిని తీసుకోవచ్చు. రైతా కూడా మంచి కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసి.. లంచ్​కి సిద్ధం చేసేసుకోండి. 

Also Read : గోదావరి స్పెషల్ తాటిగారెలు.. ఇవి చేసుకుని తినాలంటే కూసింత కళాపోషణ ఉండాలి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget