Eco Friendly Vinayaka Chavithi 2025 : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు.. ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి చేసేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్
Vinayaka Chavithi 2025 : వినాయక చవితి సందర్భంగా మీరు పర్యావరణహితమైన సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎకో ఫ్రెండ్లీ టిప్స్ ఇలా ఫాలో అయిపోండి.

Vinayaka Chavithi 2025 Celebrations : దేశవ్యాప్తంగా వినాయక చవితిని పెద్ద ఎత్తున జరుపుతారు. అయితే గణేశుడి విగ్రహం ఎంపికలో మాత్రం చాలామంది ఓ తప్పు చేస్తారు. అదే పర్యావరణ హితమైనవి ఎంచుకోకపోవడం. ఎవరో కలర్ఫుల్గా వినాయకుడిని తెచ్చుకున్నారని.. మనం కూడా తెచ్చుకోవాలని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తెచ్చుకుంటారు. అయితే ఇవి చూడడానికి బాగానే ఉంటాయి కానీ ప్రకృతికి మంచివి కావు. వీటిని నిమజ్జనం చేసేప్పుడు కాలష్యాన్ని విడుదల చేస్తాయి. మరి పర్యావరణాన్ని కాపాడేందుకు, ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్ జరుపుకోవాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
మట్టి విగ్రహాలు..
వినాయక విగ్రహాలు మట్టివి లేదా ప్లాంట్ బేస్డ్ విగ్రహాలు తెచ్చుకుంటే మంచిదని చెప్తున్నారు పర్యావరణ ప్రేమికులు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు. కానీ మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. అలాగే ప్లాంట్ బేస్డ్ విగ్రహాల్లో విత్తనాలు ఉంటాయి.. కాబట్టి అవి నీటిలో కరిగకా.. మొక్కగా పెరిగి పర్యావరణానికి మేలు చేస్తాయి.
అలంకరణ చిట్కాలు..
మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని.. అందంగా పసుపు, కుంకుమ, గంధంతో అలకంరిస్తే వినాయకుడు ఎంత ముద్దుగా కనిపిస్తాడో తెలుసా? చుట్టూ ప్రసాదాలు, పూలు, పండ్లు, దీపాల మధ్యలో ఉన్న మట్టి గణేశుడు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాల కంటే దేదివ్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తాడు.
డెకరేషన్ టిప్స్..
ప్లాస్టిక్ డెకరేషన్‌కి బదులుగా అరటిఆకులు, పువ్వులతో అందంగా అలంకరణ చేయవచ్చు. పూలతో గుమ్మాలను అలంకరించవచ్చు. తిరిగి వినియోగించుకోగలిగే క్లాత్ డెకరేషన్ ఐటమ్స్ వాడుకోవచ్చు.
ఫుడ్స్
ప్యాకెట్లో దొరికే ఫుడ్స్‌కి బదులుగా ఇంట్లోనే మంచి ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చేసి.. వాటినే అందరూ మహా ప్రసాదంగా తినొచ్చు. కాబట్టి బయటి స్వీట్స్‌కి వీలైనంత దూరంగా ఉండండి.
సౌండ్స్
చాలామంది వినాయకుడి దగ్గర డీజే పేరుతో శబ్ధ కాలుష్యం పెంచుతారు. దానికి బదులుగా శ్లోకాలు, భజనలు చేస్తే మంచిది. లేదా సౌండ్ తగ్గించి ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.
మరిన్ని చిట్కాలు..
ప్రతి ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవడం కాకుండా అందరూ కలిసి కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుంటే వేస్టేజ్ తగ్గుతుంది. అలాగే అందరి మధ్య ఐక్యత పెరుగుతుంది. పూజలో వాడిన పూలను కంపోస్ట్ చేసుకుని మొక్కలకి వినియోగించుకోవచ్చు. ఫుడ్ మిగిలితే అవసరమైనవారికి దానం చేయవచ్చు. ఇలా చేస్తే పండుగను ఆనందంగానే కాకుండా.. పర్యావరణానికి మేలు చేసే విధంగా, నలుగురికి సహాయం చేసే విధంగా జరుపుకోగలుగుతారు. ఇది మనపై వినాయకుడి ఇచ్చే బ్లెస్సింగ్స్ రెట్టింపు చేస్తుంది.






















