News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cooking Tips: ఈ పదార్థాలు బ్లెండర్‌లో అస్సలు వేయొద్దు

ఏవి పడితే అవి బ్లెండర్లో వేసి మిక్సీ చేస్తే అవి బ్లేడ్స్ చెడిపోతాయి. లేదంటే ఆహార పదార్థాలు రుచి మారిపోతుంది. మరి, ఏయే పదార్థాలు బ్లెండర్‌‌లో వేయకూడదో తెలుసా?

FOLLOW US: 
Share:

వంట చేయడం కూడా ఒక కళ. ప్రస్తుతం వంట చేయడాన్ని సులభతరం చేసే చాలా వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అవి ఈ కళనిమారింత సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా చేస్తున్నాయి. వంటగది పరికరాలలో బ్లెండర్ ఒకటి. దీన్ని ఉపయోగించడం ఎంత సులభమో సురక్షితంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. బ్లెండర్ సహాయంతో పూరీలు, స్మూతీస్, పేస్ట్ లు త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇది లేకుండా ఒక్కరోజు కూడా పని గడవదు. కానీ మనకి తెలియకుండానే బ్లెండర్ ఉపయోగించే తప్పుడు చేసే కొన్ని తప్పులు వాటిని పాడు చేస్తాయి. అందుకే బ్లెండర్ ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా ఈ ఆహారాలు అందులో వేయకూడదనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

బంగాళాదుంప

బంగాళాదుంపలు అనేక విధాలుగా తీసుకుంటారు. కానీ వాటిని బ్లెండర్ లో ఉంచితే అసలు బాగోదు. ఎందుకంటే వాటిలో ఇప్పటికే చాలా పిండి పదార్థాలు ఉన్నాయి. వాటిని బ్లేడ్ చేయడం వల్ల వేగవంతమైన కదలికకు అవి మరింత ఎక్కువ పిండిని విడుదల చేస్తాయి. మీకు కావాల్సిన ఫలితం పొందలేరు.

ఫ్రీజ్ చేసిన ఆహారాలు

బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, కూరగాయలు మొదలైన ఘనీభవించిన ఆహారాలను బ్లెండర్ లో ఉంచడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్రీజర్ లో ఉండటం వల్ల చాలా గట్టిగా ఉంటాయి. బ్లేడ్ వాటిని విచ్చిన్నం చేయడం కష్టం. వాటిని బ్లేడ్ చేయాల్సి వస్తే గది ఉష్ణోగ్రత వద్ద కాసేపు ఉంచితే అవి కరిగిపోతాయి. అప్పుడు బ్లెండ్ చేసుకోవచ్చు.

వేడి పదార్థం

వేడి వేడి ఆహార పదార్థాలు బ్లెండలో వేయకూడదు. పచ్చడి, గ్రేవీలను మెత్తగా చేయడం కోసం వేడి పదార్థాలు అందులో వేసి మిక్స్ చేస్తారు. ఇది చాలా ఆవిరి, ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల బ్లెండర్ పేలిపోయే ప్రమాదం ఉంది. వేడి చీజ్ ను బ్లెండర్ లో ఉంచడం ప్రమాదకరం.

ఘాటైన వాసన కలిగిన ఆహారాలు

బలమైన వాసన కలిగిన ఆహారాలను బ్లెండర్ లో పెట్టకూడదు. చాలా మంది ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం బ్లెండర్ లో వేసి పేస్ట్ చేస్తారు. ఇవి ఘాటైన వాసన కలిగి ఉంటాయి. ఆ స్మెల్ వాటికి పడుతుంది. దాన్ని వదిలించుకోవడం కష్టం. అంతే కాదు తర్వాత వేసే పదార్థాలకు ఈ వాసన అంటుకుంటుంది. అప్పుడు వాటి రుచి మారిపోతుంది.

పిండి

చేతులతో పిండి కలపడం కష్టంగా ఉంటుందని బ్లెండర్ లో పిండిని వేసి కలుపుతారు. ఇలా అసలు చేయకూడదు. ఇది సమయాన్ని ఆదా చేయడంతో సహాయపడుతుంది. కానీ నిజానికి ఇది ఉత్తమ ఫలితాలను ఇవ్వదు. బ్లెండర్ బ్లేడ్ దీని కోసం పనికిరావు. గట్టిగా ఉండే పిండి వేయడం వల్ల ఒక్కోసారి బ్లేడ్స్ విరిగిపోయే ప్రమాదం ఉంది.

అల్లం

ప్రతి ఒక్కరూ అల్లం వినియోగిస్తారు. టొమాటోలతో పాటు బ్లెండర్ లో అల్లం జోడించే వాళ్ళు చాలా మంది. కానీ అల్లంలోని జ్యూస్ లేదా లిక్విడ్ కంటెంట్ నుంచి పీచు భాగాన్ని వేరు చేయగలదని చాలా మందికి తెలియదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే తినడానికి కూడా రుచిగా ఉండదు. పీసులు పీసులుగా ఉండటం వల్ల వంటల్లో దాన్ని వేస్తే రుచి వేరుగా తినేందుకు ఇబ్బందిగా ఉంటుంది.

Also Read: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Published at : 05 Jun 2023 11:07 PM (IST) Tags: flour Ginger Cooking Tips Blender Kitchen Hackes

ఇవి కూడా చూడండి

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం

Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం

టాప్ స్టోరీస్

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు