Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట
ఎండ, చలి, వర్షాకాలం ఏది వచ్చినా కూడా మనలో చాలా మందికి కామన్ గా ఎదురయ్యే సమస్య కడుపు నొప్పి. అలా ఎందుకు వస్తుందో తెలుసా?
వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా కూడా మన కడుపు ఇబ్బంది పెట్టేస్తుంది. క్లైమేట్ వేడిగా, చల్లగా ఉన్నా అది శరీర భాగాలపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉష్ణోగ్రతలో పెరుగుదల లేదా తగ్గుదల అనేది వ్యక్తులలో తేలికపాటి కడుపు తిమ్మిరి, నొప్పికి కారణమవుతుంది. ఇది జీర్ణవ్యవస్థని మందగించేలా చేస్తుంది. జీర్ణ అవయవాలు కడుపు, ప్యాంక్రియాస్, చిన్న పేగులు సరిగా పని చేయవు. ఉష్ణోగ్రత మారినప్పుడు గ్యాస్, ఉబ్బరం, నిరంతరం పొట్ట నిండిన అనుభూతి సమస్యలు తలెత్తుతాయి.
వాతావరణం మారడం వల్ల కడుపు నొప్పి ఎందుకు వస్తుంది?
అకాల వర్షాలు, వేడి గాలులు వల్ల మనలో చాలా మందికి తరచుగా కడుపు నొప్పి వస్తుంది. ఇది గ్యాస్ట్రోఎంటరాలజీ పరిస్థితులు ఎదురవుతాయి. మలబద్ధకం, అతిసారం సమస్యలు వస్తాయి. అధిక ఉష్ణోగ్రత సమయంలో జ్వరం, అతిసారం, అలసట, అజీర్ణం వంటి లక్షణాలు కామెర్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. టైఫాయిడ్ జ్వరం, నీటి ద్వారా వచ్చే వ్యాధుల కేసులు కూడా పెరుగుతాయి. వేసవిలో ఆహారం పాడవడానికి ఆస్కారం ఉంటుంది. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా దారితీస్తుంది. ఇవే కాదు వైరల్ జ్వరాలు ప్రబలమవుతాయి. వేడి వల్ల డీహైడ్రేషన్ మరింత తీవ్రమవుతాయి.
వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఆకలిని కోల్పోతారు. వ్యాధికారక క్రిముల దాడి నుంచి కాపాడే మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. వేడి, ఒత్తిడి వాటి పెరుగుదలని నిరోధిస్తుంది. అటువంటి సమయంలో గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. వాతావరణం మారినప్పుడు గట్, పొత్తి కడుపు సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయట పడొచ్చు.
కాలానుగుణ ఆహారం తినాలి
ఆరోగ్యంగా ఉండాలంటే కాలానుగుణ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి గట్ మైక్రోబయామ్ ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. సీజన్ కానీ ఆహారాలలో లెక్టిన్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి పేగులను దెబ్బతీస్తాయి. గట్ మైక్రోబయోమ్ లో అసమతుల్యని సృష్టిస్తాయి.
ఫైబర్ తినాలి
మైక్రోబయోటాను అందించడం కోసం ప్రీబయోటిక్ ఫైబర్ తీసుకోవాలి. ఇది కడుపు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రీబయోటిక్ ఫైబర్ గట్ బ్యాక్టీరియాని అందిస్తుంది. ఇవి గట్ సరిగా పని చేయడానికి సహాయపడతాయి. బ్రోమెలైన్ తో కూడిన పైనాపిల్, నారింజ వంటి పండ్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉండే క్వినోవా, విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం పప్పులు అన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్.
ఎండలో ఉండాలి
శీతాకాలం సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. చాలా మంది బయటకి రాకుండా ఇంట్లోనే ఉండటంతో విటమిన్ డి లోపానికి గురవుతారు. ఇది గట్ మైక్రోబయోమ్ లో అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే కాసేపు బయటకి వెళ్ళి శరీరానికి ఎండ తగిలే విధంగా ఉండాలి. ఇక వేసవిలో అయితే ఎండలో తిరగకపోవడమే మంచిది. తేలికపాటి వ్యాయామాలు చేయడం ముఖ్యం. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం తీసుకోవాలి. ఇది మానసిక స్థితిని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగా ఉండేలా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు