(Source: ECI | ABP NEWS)
Mahammad Siraj : మహమ్మద్ సిరాజ్ డైట్, ఫిట్‌నెస్ సీక్రెట్స్.. చీట్ డేలో బిర్యానీ, రోజువారీ డైట్‌లో క్లీన్ ఫుడ్!
Siraj Fitness : ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఇప్పుడు అందరి చూపు సిరాజ్ పైనే పడింది. అసలు ఈ మనిషి ఏమి తింటున్నాడు భయ్యా.. ఆ ఫిట్‌నెస్ ఏంటి అంటూ తెగ ఎత్తేస్తున్నారు. మరి సిరాజ్ డైట్ ఏంటి?

Mahammad Siraj Fitness Plan : “Who is the fittest bowler in this era?” అనే ప్రశ్నకు చాలా మంది ఇచ్చే సమాధానం – మహమ్మద్ సిరాజ్. ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత అతని ఫిట్‌నెస్‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. గాయాలు లేకుండా, ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తూ, వర్క్‌లోడ్ భావించకుండా... consistentగా ఇండియాకు ఎప్పుడూ వికెట్లు కావాలన్నా.. నేనున్నాంటూ ముందుకు వచ్చాడు.
ఇండియా ఇంగ్లాండ్ సిరీస్‌లో ఇరు జట్లలో.. 5 టెస్టులు ఆడిన ఏకైక పేసర్‌గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. గడిచిన ఐదేళ్లుగా ఎలా గాయాల బారిన పడకుండా.. తన శరీరాన్ని కాపాడుకుంటున్నాడు. ఫిట్నెస్కి ప్రాధన్యత ఇస్తూ.. జిమ్‌లో కష్టపడే ఈ ఫాస్ట్ బౌలర్ ఎలాంటి డైట్ తీసుకుంటాడో ఎవరికి తెలియదు. కానీ ఇతనికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అనేది పలు ఇంటర్వ్యూలలో చాలాసార్లు తెలిపాడు. మరి సిరాజ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? డైట్ ఏ విధంగా ఫాలో అవుతారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పక్కా హైదరాబాదీ
సాధారణంగా క్రికెటర్లకు ఫిట్‌నెస్ మైండ్‌సెట్ వుంటుంది. కానీ చీట్ డేస్‌లో మాత్రం వాటిని పక్కన పెడతానని సిరాజ్ తెలిపాడు. ఆ సమయంలో ఎక్కువగా హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని.. ముఖ్యంగా కస్టర్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇరానీ ఛాయ్ కూడా సిరాజ్ ఎక్కువగా ఇష్టపడతారు. "బిర్యానీ అంటే చాలా ఇష్టం. Hyderabad food మిస్ అవ్వను" చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు.
రెస్టారెంట్ ఓనర్ కూడా
View this post on Instagram
సిరాజ్‌కు ఫుడ్ అంటే ఇష్టం. అందుకే హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్ కూడా ప్రారంభించాడు. అయితే అతను ఎప్పుడు రెస్టారెంట్‌కి వెళ్లినా ఓ ఫేవరెట్ ఆర్డర్ ఉంటుందట. అదే జీరా రైస్, బటర్ చికెన్, పుచ్చకాయ జ్యూస్. వీటిని ఎప్పుడూ రెస్టారెంట్‌కి వెళ్లినా తీసుకుంటానని చెప్పాడు. "Simple and satisfying food ఉంటే చాలు" అని రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు అతిగా ఆలోచించకుండా.. క్లారిటీతో నచ్చిన ఫుడ్‌ని కడుపు నిండా చాలని చెప్పాడు.
ఫిట్‌నెస్ రొటీన్
View this post on Instagram
ఫిట్‌గా ఉండేందుకు వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు సిరాజ్. కార్డియో రెగ్యులర్‌గా చేస్తాడు. దీనివల్ల మొబిలిటీ, ఫ్లెక్సీబులిటీ పెరుగుతుంది. బరువులు కూడా ఎత్తుతాడు. రన్నింగ్ చేయడం, ఎరోబిక్స్ చేయడం అతని ఫిట్‌నెస్‌లో భాగమే. సమతుల్యమైన క్లీన్ డైట్ తీసుకుంటాడు సిరాజ్. ఎనర్జీని పెంచుకునేందుకు నట్స్, సీడ్స్ డైట్‌లో తీసుకుంటారు. ఫిట్‌నెస్‌లో భాగంగా స్విమ్మింగ్ కూడా ఎక్కువగానే చేస్తాడు ఈ ఫాస్ట్ బౌలర్.

మీరు కూడా సిరాజ్లాగా ఫిట్‌గా ఉండాలంటే.. క్లీన్ డైట్ తప్పనిసరి అని తెలుసుకోవాలి. చీట్ డేలో మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి. కానీ మితంగా తింటే మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ.. బ్యాలెన్స్‌గా, డిస్ప్లేన్గా ఉంటే.. మీరు కూడా ఆ తరహా ఫిట్‌నెస్ లెవెల్స్‌ని అందుకోగలుగుతారు.






















