పాలు కాల్షియం, ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి కండరాలకు శక్తిని అందించడంలో హెల్ప్ చేస్తాయి.
బరువు ఆరోగ్యంగా పెరగాలనుకుంటే మీ డైట్లో అరటిపండ్లు, పాలను చేర్చుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన కేలరీలు అందిస్తాయి. ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.
రోజుకు ఒక గ్లాసు ఫ్యాట్ మిల్క్‌తో రెండు బాగా పండిన అరటిపండ్లు తీసుకోవచ్చు. ఈ మిశ్రమం మంచి కేలరీలను అందిస్తుంది. మిమ్మల్ని కడుపు నిండుగా ఉంచుతాయి.
ఈ కాంబినేషన్ తీసుకోవడానికి ఉదయం సమయం అనుకూలం. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. రోజంతా నిరంతర శక్తిని అందిస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లు, పాలు తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఫుడ్. పైగా త్వరగా తీసుకోవచ్చు. ఇది అనారోగ్యం లేకుండా బరువు పెరగడానికి సహాయపడుతుంది.
సాదా పాలు మీకు నచ్చకపోతే.. బనానా షేక్ తయారు చేసుకోవచ్చు. బరువు పెరగడానికి సహాయపడే క్రీమీ, రుచికరమైన పానీయం కోసం అరటిపండ్లను పాలతో మిక్సీ చేసుకోవచ్చు.
బాదం, జీడిపప్పు లేదా ఖర్జూరాలతో మీ బనానా షేక్‌ను మరింత టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్‌ను అందిస్తాయి.
బరువు పెరగడానికి రోజూ అరటిపండు షేక్ తాగండి. పాలలో కలిపి అరటిపండు తినండి. ఉత్తమ ఫలితాల కోసం రోజూ తీసుకుంటే బరువు పెరుగుతారు.