చాలామందికి తిన్న తర్వాత తేన్పులు వస్తాయి. ఇది సాధారణమైన విషయమే అనిపించినప్పటికీ.. ఇది ఆహారపు అలవాట్లు, జీర్ణక్రియ గురించి హింట్స్ ఇస్తుందట.
అప్పుడప్పుడు తేన్పులు రావడం సాధారణం. కానీ హానికరం కాదు. కానీ తరచుగా తేన్పులు రావడం అనేది మీరు ఎలా తింటున్నారో దానికి మీ శరీరం ఎలా స్పందిస్తుందో చెప్పడానికి సంకేతం కావొచ్చట.
తేన్పులు మనం పట్టించుకోని అనేక చిన్న అలవాట్ల వల్ల సంభవించవచ్చు. కారణాలను అర్థం చేసుకోవడం ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందట.
కొందరు వేగంగా తింటారు. లేదా పెద్ద ముద్దలు తింటారట. ఆ సమయంలో అదనపు గాలిని మింగేస్తారు. అది తరువాత తేనుపు రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి తినేటప్పుడు మీ వేగాన్ని తగ్గించండి.
తొందరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది. భోజనం చేసిన తర్వాత తేన్పులు రావడానికి ఇది ఒక ప్రధాన కారణం.
భోజనం చేసేటప్పుడు నోరు తెరిచి ఉంచడం వల్ల అదనపు గాలి కడుపులోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల తరచుగా తేనుపులు వస్తాయి.
తక్కువ నమలడం లేదా నోరు తెరిచి తినడం వల్ల గాలి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. శరీరం సహజంగానే తేన్పుల ద్వారా దానిని విడుదల చేస్తుంది.
అజీర్ణం, గ్యాస్ లేదా మలబద్ధకం కడుపులో ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ గ్యాస్ తరచుగా త్రేన్పుల ద్వారా బయటకు వస్తుంది.
భోజనం మానేయడం లేదా ఎక్కువ గంటలు ఆకలితో ఉండటం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. ఇది తరచుగా తిన్న తర్వాత తేనుపు రూపంలో విడుదలవుతుంది.