అలసిపోయినప్పుడల్లా పని ఒత్తిడే కారణం అనుకుంటున్నారా? అయితే ప్రతిసారీ ఇదే కారణం కాదు.
కొన్నిసార్లు అలసట అనేది శరీరానికి ఏదో సరిగ్గా లేదని సంకేతాన్ని సూచిస్తుందట. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
అలసట అనేది TATTని సూచిస్తుంది. ఈ సమస్య విటమిన్ B-12 లోపం వల్ల వస్తుంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం.. అమెరికాలో దాదాపు 18% మంది విటమిన్ B-12 లోపంతో బాధపడుతున్నారు.
ఈ లోపం అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారవచ్చు.
మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు భావిస్తే నిద్ర సమస్య, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లేదా చేతులు, కాళ్ళు మొద్దుబారడం వంటి లక్షణాలు సూచిస్తుంది. ఇది విటమిన్ B-12 లోపం కావచ్చు
కొన్నిసార్లు నరాల బలహీనత ఎముకలలో నొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం కూడా దీని సంకేతాలు. సకాలంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
విటమిన్ B12 లోపం తగ్గించడానికి సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు మీ ఆహారంలో పాలకూర, దుంప, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పనీర్ వంటివి చేర్చుకోవాలి.
మాంసాహారులు గుడ్లు, చేపలు, సీఫుడ్ కూడా ఎక్కువ మొత్తంలో తినవచ్చు. ఇవన్నీ శరీర లోపాలను తీర్చడానికి సహాయపడతాయి.